అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు.
ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్ను అతలాకుతలం చేశాయి. నెలల పాటు కురవాల్సిన వర్షమంతా కొన్ని గంట్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడాలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకన్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి.
అమెరికాలో తుఫాన్ బీభత్సం సృష్టించింది. టెక్సాస్ వరదలతో వణుకుతోంది. ఆకస్మిక వరదల కారణంగా, గ్వాడాలుపే నది దాదాపు 45 నిమిషాల్లో 26 అడుగులు పెరిగి ఉదృతంగా ప్రవహిస్తోంది. వరద కారణంగా, తొమ్మిది మంది పిల్లలు సహా 43 మంది మరణించారు. అదే సమయంలో, వేసవి శిబిరం నుంచి 23 మంది బాలికలు సహా 27 మంది గల్లంతయ్యారు. తుఫాను సెంట్రల్ టెక్సాస్ మీదుగా కదులుతున్నందున మరిన్ని భారీ వర్షాలు, వరదలు సంభవించే అవకాశం ఉందని నేషనల్ వెదర్…
రష్యా-ఉక్రెయిన్ వెనుక యుద్ధాలు మొదలు పెట్టిన దేశాలన్నీ ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాయి. కాల్పుల విరమణతో శాంతి వాతావరణం చోటుచేసుకున్నాయి. ఇరాన్-గాజా-ఇజ్రాయెల్ దేశాల మధ్య ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలపై విధించిన డెడ్లైన్ జూలై 9తో ముగుస్తోంది. ఇక ఈ డెడ్లైన్ పొడిగించే ప్రసక్తే లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ స్పష్టం చేశారు.
గాజాతో 60 రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్.. మమ్దానీపై తీవ్రంగా స్పందించారు. తాజాగా మమ్దానీ రియాక్ట్ అయ్యారు. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిగా భారత ముస్లిం సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ ఎన్నికయ్యారు.
భారత్-అమెరికా మధ్య భారీ వాణిజ్య ఒప్పందం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు 48 గంటల్లో కీలక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇప్పటికే ఇరు దేశాల మధ్య రహస్య చర్చలు జరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను మొదటి నుంచి మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మస్క్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్-ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య మరోసారి విభేదాలు తీవ్రం అవుతున్నాయి. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మరోసారి మస్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.