Modi-Trump meet: అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల చివర్లో మలేషియా కౌలాలంపూర్‌లో జరగనున్న ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలిసే అవకాశం ఉంది. అక్టోబర్ 26-27 తేదీల్లో 47వ ఆసియాన్ సదస్సు కోసం మోడీ మలేషియా వెళ్లనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ట్రంప్‌కు ఆహ్వానం పంపింది.
Read Also: Yashashree Rao: తెలుగులో హీరోయిన్గా మరాఠీ సోషల్ మీడియా భామ!
ట్రంప్ ఈ ఆహ్వానాన్ని ఒప్పుకుంటే, అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాలను విధించిన తర్వాత ఇద్దరు నేతల మధ్య ఇదే తొలి భేటీ అవుతుంది. ట్రంప్ సుంకాల కారణంగా భారత్ అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంగా, ఈ డబ్బును రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వినియోగిస్తుందని ఆరోపిస్తూ భారత్‌పై అమెరికా 50 శాతం సుంకాలు విధించింది. ఇందులో 25 శాతం పరస్పర సుంకాలు కాగా, మరో 25 శాతం శిక్షార్హమైన సుంకంగా అమెరికా అభివర్ణించింది.