PM Modi: ప్రపంచ నాయకులు ‘డెమోక్రటిక్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్’ జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ అగ్రస్థానంలో ఉన్నారు. ప్రపంచ నాయకుల్లో ఎవరికీ లేని ఆదరణ మోడీకి ఉన్నట్లు తేలింది. అమెరికా బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ అయిన ‘‘మార్నింగ్ కన్సల్ట్’’ శుక్రవారం విడుదల చేసిన డేటాలో మోడీ అగ్రస్థానంలో ఉన్నట్లు చూపించింది. ప్రధాని మోడీకి ఏంకగా 75 శాతం అప్రూవల్ రేటింగ్ ఉందని తెలిపింది.
హమాస్ అంతమే లక్ష్యంగా గత కొన్ని నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ భీకరదాడులు చేస్తోంది. వందలాది మంది పాలస్తీనా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు.
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కొలిక్కిరాలేదు. తాజాగా జరిగిన ఐదో రౌండ్ చర్చలు కూడా అసంపూర్తిగానే ముగిశాయి. ఆగస్టు 1 వరకు ట్రంప్ గడువు విధించారు. అమెరికా విధించిన డెడ్‌లైన్ దగ్గర పడుతోంది. అయినా కూడా ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముగింపునకు రాలేదు. ఇంకా తీవ్ర సందిగ్ధం నెలకొంది.
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. పహల్గామ్ ఉగ్ర దాడికి ఆద్యుడు. కాశ్మీర్‌పై రెచ్చగొట్టిన ప్రసంగం చేసిన తర్వాతే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
అమెరికా, ఇజ్రాయెల్‌కు ఖమేనీ వార్నింగ్.. ఈసారి కాలు దువ్వితే..! అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై ఇరాన్ దాడిని ఎత్తి చూపుతూ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. పూర్తిగా రంగంలోకి దిగితే టెహ్రాన్ సామర్థ్యమేంటో రూచి చూపిస్తామని అమెరికా, దాని మిత్ర…
అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. మరోసారి దాడి జరిగితే భారీ స్థాయిలో ఎదురుదాడి జరగడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు.
దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత వాతావరణం నెలకొనగా.. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ రాజీనామా చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జెఫ్రీ ఎప్స్టీన్పై దర్యాప్తును ముగించాలని న్యాయ శాఖ తీసుకున్న నిర్ణయంపై అంతర్గత ఉద్రిక్తతల నేపథ్యంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ రాజీనామా చేయబోతున్నట్లు పుకార్లు వ్యాప్తి చెందాయి.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల అమెరికాలో పర్యటించారు. నాలుగు రోజుల పర్యటన ముగించుకుని విజయవంతంగా తిరిగి వచ్చారు. అయితే అమెరికా పర్యటనలో ఉన్న నెతన్యాహు రహస్య సమావేశాలు నిర్వహించారు.