మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు. భారత్‌పై సుంకాల భారం పడటంతో పుతిన్ భవిష్యత్ వ్యూహాల గురించి మోడీ అడిగి తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్ పర్యటనలో మార్క్ రుట్టే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: Netanyahu: అరెస్ట్ భయంతో నెతన్యాహు అమెరికాకు ఎలా వెళ్లారంటే..!
రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. దీంతో అత్యధిక సుంకం భరిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. అయితే సుంకాలు కారణంగా పుతిన్‌తో మోడీ చర్చలు జరుపుతున్నారని.. భవిష్యత్ వ్యూహాన్ని వివరించాలని పుతిన్‌ను మోడీ అడిగినట్లుగా మార్క్ రుట్టే చెప్పుకొచ్చారు. అయితే రుట్టే వ్యాఖ్యలపై ఇప్పటి వరకు భారత్ గానీ.. రష్యా గానీ స్పందించలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. నేటి బంగారం ధరలు ఇలా..!
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ పుతిన్ అంగీకరించలేదు. దీంతో రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడం వల్లే పుతిన్ శాంతి ఒప్పందానికి రావడం లేదని ఆరోపించారు. దీంతో భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించారు.
ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. అలాగే త్వరలో మోడీ-ట్రంప్ మధ్య కూడా కీలక సమావేశం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల సెప్టెంబర్ 16న ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారత్, మోడీ మంచి మిత్రులు అని పేర్కొన్నారు.