Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక
- హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్
- లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమాస్ ఉగ్రవాదులకు ట్రంప్ కొత్త డెడ్‌లైన్ విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రావాలని కోరారు. లేదంటే సాయంత్రం 6 గంటల తర్వాత నరకం చూస్తారని హెచ్చరించారు. ఇటీవల గాజా-ఇజ్రాయెల్ మధ్య 20 పాయింట్ల ప్రణాళికను ట్రంప్ ప్రవేశపెట్టారు. దీనికి ఆయా దేశాలు మద్దతు తెలిపాయి. కానీ హమాస్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. సజీవంగా ఉన్న బందీలను, చనిపోయిన బందీలను ఇజ్రాయెల్‌కు అప్పగించాలని.. అలాగే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాలని ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికలో ముఖ్యమైనవి.
ఇది కూడా చదవండి: Delhi Liquor Policy: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీకి ప్లాన్!.. 25 ఏళ్ల వయసు తగ్గించే యోచన
Also Read
అయితే ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. దీంతో మరోసారి అల్టిమేటం విధించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందానికి అంగీకరించాలని.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని ట్రంప్ హమాస్‌కు అల్టిమేటం జారీ చేశారు. ఇంతకు ముందు ఎవరూ చూడని నరకం చూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: UP: సినిమా రేంజ్‌లో కాల్పులు.. హత్య దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్
గాజా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని ముగించేందుకు 20 పాయింట్ల రోడ్‌మ్యాప్‌ను వైట్‌హౌస్ విడుదల చేసింది. తక్షణ కాల్పుల విరమణ, బందీల విడుదల, కొత్త పరిపాలనా ఏర్పాటుకు దశలవారీగా విస్తరించడం.. మొదలగు అంశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రణాళికను ఆయా దేశాలు స్వాగతించాయి. కానీ హమాస్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆ సమయానికి శాంతి ఒప్పందం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హమాస్‌ను హెచ్చరించారు.
"We will have PEACE in the Middle East one way or the other. The violence and bloodshed will stop. RELEASES THE HOSTAGES, ALL OF THEM, INCLUDING THE BODIES OF THOSE THAT ARE DEAD, NOW! An Agreement must be reached with Hamas by Sunday Evening at SIX (6) P.M., Washington, D.C.… pic.twitter.com/TiIzOLFhE5
— The White House (@WhiteHouse) October 3, 2025
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!