ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు చేశాయి. ప్రాముఖ్యంగా ఫార్డో అణు కేంద్రాన్ని బీ-2 బాంబర్లు ధ్వంసం చేశాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెబుతున్నారు.
ట్రంప్ హెచ్చరిక.. పన్నులను తొలగించే వరకు కెనడాతో చర్చలుండవ్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు హెచ్చరికలు జారీ చేశఆడు. ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కెనడా కొన్ని పన్నులను రద్దు చేసే వరకు అమెరికా, కెనడా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ముందుకు సాగవని స్పష్టం చేశారు. కెనడాను “బ్యాడ్ బిహేవియర్” దేశంగా ఆయన అభివర్ణించారు. నేటి (సోమవారం) నుంచి అమల్లోకి రానున్న డిజిటల్ సర్వీసెస్ టాక్స్ (DST) కొన్ని పన్నులను తొలగించాలని…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును దేవుని శత్రువులుగా పరిగణిస్తూ ఇరాన్‌లోని ప్రముఖ షియా మతాధికారి అయతుల్లా నాజర్ కమరెం షిరాజీ ఫత్వా జారీ చేశారు. వీరికి వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా వీరిద్దరికి ఏ ముస్లిం నాయకులు కూడా మద్దతు ఇవ్వొద్దని ఫత్వాలో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. వైట్‌హౌస్‌లో నిర్వహించిన సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం మాటల యుద్ధం సాగుతోంది. నిన్నామొన్నటి దాకా క్షిపణులతో దాడులు చేసుకోగా.. తాజాగా వార్నింగ్‌లు ఇచ్చుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరాన్ హెచ్చరించింది.
భారత దేశంతో చాలా పెద్ద వాణిజ్య ఒప్పందం చేసుకోబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతం ఇచ్చారు. వైట్ హౌస్‌లో జరిగిన ‘‘బిగ్ బ్యూటిఫుల్ ఈవెంట్’’లో ట్రంప్ ప్రసంగించారు.
ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించిందని ప్రధాని నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరించినట్లు పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన స్టాక్ మార్కెట్‌కు సరికొత్త ఊపు తీసుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ముగిసిందంటూ ప్రకటించారు. 24 గంటల్లో దశలవారీగా కాల్పుల విరమణ జరుగుతోందని వెల్లడించారు.
ఇరాన్ ఇకపై అణ్వాయుధాలను తయారు చేయలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. ఫాక్స్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ విత్ బ్రెట్ బేయర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేడీ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.