అక్టోబర్ 7, 2023 ఎవరూ మరిచిపోలేని రోజు. ప్రపంచమంతా ఉలిక్కిపడ్డ రోజు. హమాస్ ముష్కరులు ఊహించని రీతిలో ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1,200 మందిని చంపి దాదాపు 251 మందికి పైగా బందీలుగా తీసుకెళ్లిపోయారు. ఈ ఘటన ఇజ్రాయెల్‌నే కాకుండా యావత్తు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఇక అంతే వేగంగా ఇజ్రాయెల్ కూడా ప్రతి స్పందించి హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై భీకర దాడులు చేసింది. హమాస్ అగ్ర నాయకులందరినీ మట్టుబెట్టింది. ఈ క్రమంలో వందలాది మంది పాలస్తీనీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ నాడు మొదలైన యుద్ధం.. నేటికీ కొనసాగుతోంది. ఈరోజుతో (07-10-2025) గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై రెండేళ్లు పూర్తైంది. గాజా ప్రస్తుతం శవాల దిబ్బగా మారింది. ఎటుచూసినా కూలిన బిల్డింగ్‌లతో కళావిహీనంగా మారింది.
ఇది కూడా చదవండి: EV Prices: ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి గడ్కరీ గుడ్ న్యూస్..
ప్రస్తుతం ట్రంప్ శాంతి ఒప్పందానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. బందీలందరినీ ఒకేసారి విడుదల చేసేందుకు హమాస్ ఒప్పుకుంది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. సోమవారం ఈజిప్టు వేదికగా శాంతి చర్చలు జరిగాయి. కానీ ఇప్పటి వరకు ఇజ్రాయెల్ బందీలను మాత్రం హమాస్ విడుదల చేయలేదు.
ఇది కూడా చదవండి: Farmhouse Party: ఇన్‌స్టాలో పరిచయాలు.. వీకెండ్‌కు చిల్ అవుదాం అనుకున్నారు.. సీన్ కట్ చేస్తే..
ఇదిలా ఉంటే హమాస్‌కు గత ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు డెడ్‌లైన్ విధించారు. ఆలోపు శాంతి ఒప్పందానికి అంగీకారం తెలియజేయకపోతే నరకం చూస్తారని గట్టి వార్నింగ్ ఇచ్చారు. కానీ గడువు ముగిసింది. రెండేళ్లు పూర్తయ్యాయి. కానీ బందీలు మాత్రం విడుదల కాలేదు. ట్రంప్ శాంతి చర్చలు ఏ మాత్రం ప్రతి ఫలం ఇస్తాయో ఇంకా తేలడం లేదు.
ఈ మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల కారణంగా కొంత మంది బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేసింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని ఇజ్రాయెల్ పట్టుబట్టింది. కానీ హమాస్ మాత్రం అందుకు ససేమిరా అందింది. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి శాంతికి శ్రీకారం చుట్టారు. ఈ చర్చలు ఏ మాత్రం ప్రయోజనం చేకూర్చుతాయో తేలాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: సీజేఐపై దాడికి యత్నం.. పవన్ కల్యాణ్ కీలక ట్వీట్..