నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ వచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు…
సోమారపు సత్యనారాయణ. రామగుండం మాజీ ఎమ్మెల్యే. కండువా మార్చినా ఆయనకు పట్టు చిక్కడం లేదట. ఇన్నాళ్లూ ఏ పార్టీలో ఉన్నా.. నిత్య పోరాటమే చేస్తున్నారు. ఎక్కడ ఉన్నా.. కొత్తగా వచ్చిన నేతలతో ఆయనకు తలనొప్పులు తప్పడం లేదట. దీంతో సొంత గూటిని వదిలి తప్పు చేశామా అని ఆలోచన చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం అక్కడా ఖాళీ లేకపోవడంతో మరోసారి స్వతంత్రంగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలనే యోచనలో ఉన్నారట సోమారపు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉందని, సాయుధ పోరాట పటిమ గల నాయకత్వం ఈ జిల్లాలో ఉందన్నారు. నాగార్జున సాగర్ డ్యామ్ కాంగ్రెస్ కట్టామని సగర్వంగా చెప్పుకుంటామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. మేము మొదలుపెట్టి అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మలు మీరు.. అని ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లికల్లు లిఫ్ట్…
కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చేతులెత్తేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన సరే వడ్లు కొంటామని ముందుకొచ్చిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి మంత్రి హరీష్ రావు పర్యటించారు. మండల కేంద్రాలైన రాయపోల్, తొగుటలో 3.5కోట్లతో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలతో…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు, టీఆర్‌ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. బాల్క సుమన్ కి తెలివి ఉందో..లేదో తెలియదని, అయన రాజకీయం నా గడ్డం లో వెంట్రుక కి కూడా పనికి రాడు అంటూ జగ్గారెడ్డి ఫైర అయ్యారు. గడ్డం లో వెంట్రుక లాంటి వాడు… పీకేస్తే పోతాడని ఆయన మండిపడ్డారు. సుమన్ ది ఉరుకులాడే వయసు…
వికారాబాద్ జిల్లా తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ బండ బూతులు తిట్టిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి స్పందిస్తూ.. పొరపాటున నోరుజారిన ఆడియో క్లిప్ లతో మనసులు నొప్పించినందుకు విచారిస్తున్నానని ఆయన అన్నారు. నిన్నటి సంఘటనతో ఉన్న ఆడియో క్లిప్పులతో పోలీసుల మనస్సు నొప్పిస్తే అది తనకు బాధకరంగా ఉంటుందని మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఓ ప్రకటనలో పోలీసు సోదరులంతా…
సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం, మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిరంతరం 24/7 అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. హోదాలు, విధులు వేరైనా అందరం ప్రజలకు సేవకులం అని, వారికి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యారోగ్య శాక మంత్రి హరీష్ రావు వైద్య సిబ్బందికి సూచించారు. అవసరం లేకున్నా గర్భిణులకు…
మరోసారి బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ బాల్క సుమన్. నిన్న టీఆర్‌ఎస్ పార్టీ 21వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగాయి. ఈ ప్లీనరీ సమావేశాల్లో 13 కీలక తీర్మానాలు చేశారు. ఈ నేపథ్యంలో తాజా బాల్క సుమన్ మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ తీర్మానాలపై బీజేపీ నేతల నుంచి సమాధానం లేదని ఆయన విమర్శించారు. రిజర్వేషన్లు, నవోదయ విద్యాలయాలలతో పాటు ఏ ఒక్క అంశంపై బీజేపీ నేతల వైపు నుంచి సమాధానం…
నిన్న టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్లీనరీలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు వెల్లడించారన్నారు. పూనకo వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, బీజేపీ అంటే భయపడుతున్నారన్నారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణను ఏం ఉద్ధరించారని, పౌరుడిగా ఫ్రoట్ పెట్టొచ్చు, టెంట్ వేసుకోవచ్చునన్నారు. రాజ్యంగం ప్రకారం ఉన్నత పదవుల్లోకి రావచ్చునని ఆయన అన్నారు. గుణాత్మక పరిపాలన అంటే కల్వకుంట్ల పాలనా? గుణాత్మక పాలన అంటే ఏ ఎండకు ఆ…
ఎర్రబెల్లి, గంగుల, తలసాని, దానం లాంటి తెలంగాణ ఉద్యమ ద్రోహులు కేసీఆర్ పక్కన చేరారని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. అలాంటి వాళ్ళను కేసీఆర్‌ను పోగుడతున్నరని, 8 ఏండ్లుకు నోటిఫికేషన్లు నిన్న వచ్చాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంకు అప్పులు… కేసీఆర్ గొప్పలు.. జనంకు తిప్పలు అన్నట్టు మారింది పరిస్థితి అంటూ ఆయన విమర్శించారు. ఉద్యమ పార్టీకి వెయ్యి కోట్లు ఎక్కడి నుండి వచ్చాయని, 800 కోట్ల నగదు ఎవడబ్బ సొమ్మని,…