నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పసుపు బోర్డు తెస్తానంటూ అబద్ధపు హామీలను ఇచ్చి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారని కవిత అన్నారు. ఆయన ధర్మపురి కాదని, అధర్మపురి అని విమర్శినస్త్రాలు సంధించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్లపై హామీ ఇచ్చిన అర్వింద్.. 3 ఏళ్లైనా పసుపుబోర్డు తీసుకురాలేదని మండిపడ్డారు. మోసం చేసిన ఎంపీ ఆర్వింద్‌ను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన…
బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. కరీంనగర్‌కు వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చి… చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలన్నారు కేటీఆర్. సోమ, మంగళవారం అంటూ రాజకీయం చేయొద్దన్నారు. కేసీఆర్ లేకపోతే జన్మలో తెలంగాణ వచ్చేది కాదన్నారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ లేకుంటే తెలంగాణ పదం ఉండేదా? అని ప్రశ్నించారు కేటీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం బండలింగంపల్లి గ్రామం మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలో రూ.28 లక్షలతో నిర్మించనున్న ఆధునిక భవన నిర్మాణం, నూతన మౌలిక…
రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటనపై ప్రశ్నల వర్షం కురిపించారు మంత్రి హరీష్‌రావు.. పెద్దపల్లిలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాహుల్ ఎందుకోసం వస్తున్నావ్..? ఏం చెప్పడానికి వస్తున్నావ్..? మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ అమలవుతున్న పథకాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహి అయిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న హీనమైన…
రెండో దశ ప్రజా సంగ్రామ యాత్రలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సమస్యను తెలంగాణలో కేసీఆర్ సృష్టిస్తున్నాడని, నష్టపోయిన రైతన్నలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. తూతూ మంత్రంగా చర్యలతో తప్పించుకుంటాం అంటే.. వదిలే ప్రసక్తే లేదని, కమిటీలు, నివేదికల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. నీ దుష్ట, మూర్ఖపు, నీచమైన పాలనలో ఈ ఏడేళ్లలో ఏనాడు రైతన్నను ఆదుకోలేదని, రాష్ట్ర…
రైతుల సౌకర్యార్థం అవకాశం ఉన్న ప్రతి చోట వ్యవసాయ మార్కెట్ నిర్మాణాలకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పాల్గొన్న ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకద్రలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర సభ నిర్వహించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలమూరు నుంచి వలసలు లేవని అంటున్నారని, కానీ ఇప్పటికీ పాలమూరు ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్నారని ఆయన అన్నారు. పాలమూరు నుంచి వలసలు లేవని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, దమ్ముంటే తన…
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పర్యటనను సోమవారం రోజు అడ్డుకున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు.. రాజన్న సిరిసిల్ల పర్యటనకు వెళ్లిన ఆయనను జిల్లా సరిహద్దులో అడ్డుకున్నారు.. అంతేకాదు, ఓ టీఆర్ఎస్ కార్యకర్త పాల్‌పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. అయితే, తాను మళ్లీ సిరిసిల్ల వస్తున్నా.. దమ్ముంటే ఆపండి అంటూ సవాల్ విసిరారు కేఏ పాల్.. నాపై దాడి చేసిన అనిల్‌తో నాది తెలంగాణ కాదని చెప్పిస్తున్నారు.. బాబు అనిల్ మత్తు తగ్గిన తరువాత ఇది…
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. నిన్న తనపై దాడి జరిగిన తర్వాత ఆగ్రహంతో ఊగిపోతున్న ఆయన.. ఇవాళ మీడియా సమావేశం పెట్టి టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై ధ్వజమెత్తారు.. కేసీఆర్, కేటీఆర్ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు చేస్తున్నారని.. నిన్న సిరిసిల్ల ఎస్పీతో కేటీఆర్ మాట్లాడిన తర్వాత నాపై దాడి జరిగిందని ఆరోపించారు. ముందు 15 – 20 మంది పోలీసులు వచ్చి…
ఉమ్మడి నల్గొండ జిల్లా అధికార టీఆర్ఎస్‌లో వర్గపోరు పీక్స్‌కు చేరుకుంటోంది. ఎన్నికల వాతావరణం క్రమంగా రాజుకుని.. అందులో వర్గపోరు సెగలు రేపుతోంది. సమయం చిక్కితే చాలు అధిపత్యపోరు రకరకాల మలుపులు తిరుగుతోంది. చివరకు మేడే వేడుకలు, ఇఫ్తార్ విందుల్లోనూ తన్నుకునే వరకు వెళ్తున్నారు పార్టీ నేతలు.. వారి అనుచర వర్గాలు. నకిరేకల్‌లో ఎవరు ఎగ్జిట్ అవుతారు?నకిరేకల్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లోని పరిణామాలు ఎప్పటికప్పుడు చర్చల్లో ఉంటున్నాయి. నకిరేకల్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య మూడేళ్లుగా…
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.. కేఏ పాల్ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు.. ఇక, ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు.. పాల్ చెంపపై…