తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు, టీఆర్‌ఎస్ నేతలకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. బాల్క సుమన్ కి తెలివి ఉందో..లేదో తెలియదని, అయన రాజకీయం నా గడ్డం లో వెంట్రుక కి కూడా పనికి రాడు అంటూ జగ్గారెడ్డి ఫైర అయ్యారు. గడ్డం లో వెంట్రుక లాంటి వాడు… పీకేస్తే పోతాడని ఆయన మండిపడ్డారు. సుమన్ ది ఉరుకులాడే వయసు అని, ఇద్దరూ ముగ్గురు విద్యార్థులను సుమన్ చంపినట్టు నాకు కొన్ని లేఖలు వచ్చాయన్నారు.
అంతేకాకుండా చంపి.. ఆ డెడ్ బాడీ చేతులతో లేఖలు రాసి సమన్ పెట్టారని నాకు సమాచారం ఇచ్చారని జగ్గారెడ్డి ఆరోపించారు. మా ప్రభుత్వం వస్తే..విచారణ జరిపిస్తామని, సుమన్ నీ విడిచి పెట్టామని ఆయన వ్యాఖ్యానించారు. సుమన్‌కు బాగా దూకుడు ఎక్కువైందని, మా విద్యార్ది సంఘాల నాయకులే చూసుకుంటారని ఆయన మండిపడ్డారు.