నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరాలో 69.52 కొట్ల వ్యయంతో నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు శంకుస్దాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీది ఐరన్ లెగ్.. ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కాంగ్రెస్ నాశనం అవుతుందని ఆయన విమర్శలు గుప్పించారు. 96 శాతం ఓటమిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, స్థానికంగా సఖ్యత లేని కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ వచ్చి ఏంచేస్తాడని ఆయన ప్రశ్నించారు
. కాంగ్రెస్ పార్టీది ఓడిన చరిత్ర అని, కాంగ్రెస్ పాలనలో రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడ్డారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పెరిగిన దిగుబడితో కాంగ్రెస్ బీజేపీలకు కళ్లమంటగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం, ఎరువులు, విత్తనాల కోసం క్యూ కట్టడం, ధాన్యం కొనుగోలు చేయకపోవడం, కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం.. అసలు సాగునీరే రాకపోవడం కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న చరిత్ర అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.