కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ విడుదల చేసిన వరంగల్ డిక్లరేషన్‌పై టీఆర్ఎస్ నేత, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని రాహుల్‌గాంధీని మంత్రి నిరంజన్ రెడ్డి నిలదీశారు. రాహుల్ గాంధీ డిక్లరేషన్ పై మంత్రి మీడియాతో మాట్లాడారు. తెరాసను క్షమించం అనేందుకు రాహుల్ ఎవరని…
వరంగల్‌లోని కాంగ్రెస్ చేపట్టిన రైతు సంఘర్షణ సభలో జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వల్ల రాలేదని, ఎంతోమంది త్యాగాలతో ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఇది తెలంగాణ ప్రజల స్పప్నమన్నారు. కానీ, తెలంగాణ వల్ల బాగుపడింది మాత్రం ఒక్క కుటుంబమేనన్నారు. మీ అందరి కల నెరవేర్చడానికి అనేకమంది రక్తం చిందించారని, కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని, సోనియాగాంధీ చొరవ వల్ల తెలంగాణ ఏర్పడిందని రాహుల్ గాంధీ అన్నారు. ఛత్తీస్ ఘడ్‌లో రైతులు రుణమాఫీ…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. తెలంగాణకు వ్యతిరేకమైన టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ గురించి చెప్పడానికి తెలంగాణ వస్తున్నావా రాహుల్ అంటూ… మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ స్పందిస్తూ.. తెలంగాణకు ద్రోహం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌లు ఏ పార్టీ…
ఎప్పుడూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న ఇక నుంచి తాను సీఎం కేసీఆర్‌ను తిట్టనని శపథం పూనారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నిన్న నిర్వహించిన ‘7200 మూవ్‌మెంట్’ సన్నాహక సమావేశానికి తీన్మార్ మల్లన్న హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇకపై కేసీఆర్‌ను తిట్టబోనని ఒట్టేసి చెబుతున్నానని, అయితే, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు మాత్రం తన ‘7200 మూవ్‌మెంట్’ ద్వారా పోరాడతానని ప్రకటించారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన…
రాహుల్ గాంధీ పర్యటన పై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. గౌరవ రాహుల్ గాంధీ గారు, మీరు కానీ మీ పార్టీ కానీ ఎన్ని సార్లు పార్లమెంట్ లో తెలంగాణ అంశాలను, హక్కులను ప్రస్తావించారో చెప్పండి.? తెలంగాణ రాష్ట్ర హక్కులకోసం టిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు ? దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టిఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తున్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ప్రాజెక్టులకు రావాల్సిన జాతీయ హోదా,…
టీఆర్ఎస్ పార్టీకి కొత్త నిర్వచనం చెప్పారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సమితి అంటూ కామెంట్ చేశారు.. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పిన ఆయన.. దుబ్బాకలో ధమాకా, హుజురాబాద్‌లో హుజూర్ గిర్గయా.. ఇలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు… బీజేపీ సర్కార్, డబులింజన్ సర్కార్ కోరుకుంటున్నారని తెలిపారు. ఇక, బండి సంజయ్ పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది… మోడీ సర్కారు జవాబుదారీ ప్రభుత్వంగా పేర్కొన్నారు.…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో దశ నేడు పాలమూరు గడ్డపై ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడిన డీకే అరుణ.. తెలంగాణ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని కేసీఆర్ అడుగడుగునా మోసం చేశారని, ఇచ్చిన హామీల్ని ఏమాత్రం నెరవేర్చలేదని అన్నారు. ఇక్కడి ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు తాను కాపలా కుక్కలా ఉంటానని, ప్రాజెక్టుల్ని ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తానని మాటిచ్చాడని, కానీ ఇప్పుడా హామీల్ని తుంగలో తొక్కేశాడని…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ గాంధీ టూర్ వ్యవహారం అంతా ఉస్మానియా యూనివర్సీటీ చుట్టే తిరుగుతోంది. అయితే తాజాగా ప్రభుత్వ విప్ బాల్క్ సుమన్ రాహుల్ టూర్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ విభజన చట్టం హామీలను ఎందుకు అమలు చేయడం లేదో జేపీ నడ్డా సమాధానము చెప్పాలన్నారు. ఎన్నికల ముందు బీజేపీ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదో నడ్డా జవాబు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. జేపీ నడ్డా…
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రేపు, ఎల్లుండి తెలంగాణలో పర్యటించనున్నారు. అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ తెలంగాణకు ఎందుకు వస్తున్నావ్.. అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ హాయంలో రైతులు ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన వ్యాఖ్యానించారు. అయితే మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ట్విట్టస్త్రాలు సంధించారు. పోలీసు పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో…
గుజరాత్‌లోని గిర్(GIR) జాతీయ వన్యప్రాణుల అభయారణ్యం సందర్శన అద్భుతమైన అనుభవమని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అధ్యయన పర్యటనలో భాగంగా జైరామ్ రమేష్ అధ్యక్షతన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గుజరాత్‌లోని గిర్ నేషనల్ పార్క్‌ను సందర్శించారు. నేషనల్ పార్క్ వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సింహం ఫోటోలను ఎంపీ సంతోష్ కుమార్ తన కెమెరాలో బంధించారు. నేషనల్ పార్క్ సందర్శనలో మంత్రముగ్ధులను…