Oil Price Hike: వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం.. లీటర్ ప్యాకెట్‌పై 10 రూపాయలు పెంపు!
- గ్యాస్ ధరలపైనే కాదు వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం
- ప్యాకెట్‌కు పది రూపాయలు అదనం
- గగ్గోలు పెడుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్ యుద్ధం గ్యాస్ ధరలపైనే కాదు వంట నూనెలపై సైతం ప్రభావం చూపిస్తుంది. ఇరాన్-ఇజ్రా యెల్, అమెరికా యుద్ధాల ప్రభావంతో వంటకు ఉపయోగించే ఆయిల్ ధరపై ఎఫెక్ట్ చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరులో రెండు వారాల కిందట ధరలతో పోల్చుకుంటే.. ప్యాకెట్‌కు పది రూపాయలు అదనంగా పెంచి అమ్ముతున్నారు. దాంతో జనాలు గగ్గోలు పెడుతున్నారు. వంట నూనె తప్పనిసరి కాబట్టి.. ఎక్కువ పెట్టైనా తప్పక కొన్సాల్సిన పరిస్థితి నెలకొంది.
యుద్ధం కొనసాగితే వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం వల్ల ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాకు వంట నూనెకు సంబంధించిన ముడిసరుకు జలమార్గం ద్వారానే జరుగుతుంది. యుద్ధం రాకముందే సాధారణంగానే వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. ఆ మధ్య లీటర్ ప్యాకెట్ ధర రూ.120కి తక్కువగా ఉండగా.. కొన్ని రోజులకు రూ.14-150కి చేరింది. ఇప్పుడు లీటర్ ప్యాకెట్ ధర రూ.170గా ఉంది. దీనికి పది రూపాయలు అదనంగా అమ్ముతున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందో మరి. ఉక్రెయిన్ యుద్ధం సమయంలోనూ వంట నూనె ధరలు భారీగా పెరిగాయి. కొరత సృష్టించి బ్లాక్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
Also Read: CM Chandrababu: మంత్రులు, కలెక్టర్లు ఆటిట్యూడ్ మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
మరోవైపు కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో రాజమండ్రిలోని హోటల్స్ రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అంతర్జాతీయ యుద్ద పరిస్థితులు ప్రభావంతో హోటల్స్, రెస్టారెంట్లు సంక్షోభంలో పడ్డాయి. కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు ఉదయం పూట తీసి రాత్రులు కట్టేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్యాస్ నిలవలు నిండుకొనడంతో ఇక హోటల్స్, రెస్టారెంట్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నారు. హోటల్స్ లో పనిచేసే కొంతమంది కార్మికులను పనిలోకి రావద్దని తిరిగి పంపేస్తున్నారు. తక్కువ గ్యాస్ తో తయారయ్యే వంటకాలు మాత్రమే కస్టమర్లకు సఫరా చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!