పట్టణాలతో పల్లెలు పోటీ పడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని.. ఆ సంకల్పం నెరవేరినందునే కేంద్రం నుండి గ్రామపంచాయతీలకు అవార్డులు వచ్చాయన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్లగొండలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి అవార్డులు రావడాన్ని తట్టుకోలేకే అణిచివేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తుందని అన్నారు. డిస్కంలకు లోన్లు మంజూరు కాకుండా అడ్డుపడడం అందులో భాగమే అని ఆరోపించారు. కేంద్రం కరెంట్ రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని అన్నారు. ఇన్ని దుర్మార్గాలను తట్టుకోని కుడా అభివృద్ధి లో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారని.. ముమ్మాటికీ ఈ ఘటన సీఎం కేసీఆర్ దే అని అన్నారు.
గ్రామీణ క్రీడా సమితులకు ప్రభుత్వ గుర్తింపు ఇస్తుందని..పల్లెప్రగతి లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గ్రీన్ కవర్ దారుణంగా ఉందని.. 33 శాతం ఉండాల్సిన గ్రీన్ కవర్ 3 శాతానికే పరిమితం అయిందని అన్నారు. హరితహారంలో అందరిని భాగస్వామ్యం చెయ్యాలని జగదీష్ రెడ్డి సూచించారు. కాలువగట్లు, చెర్వుశిఖాలు, వాగులు, వంకలలో హరితహారం చెట్లను నాటాలని ఆదేశించారు. సాగర్ మెయిన్ కాలువ నుండి డిస్ట్రిబ్యూటరీ కెనాల్ వరకు ఇరిగేషన్, రెవిన్యూ అధికారులతో త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు.
పల్లెప్రగతి, పట్టణప్రగతిపై శాసనసభ్యులు సమీక్షలు నిర్వహించాలని కోరారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. పల్లెప్రగతిలో పాఠశాలలను విధిగా సందర్శించాలి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మోాకాలొడ్డుతుందని విమర్శించారు. అధికారులు భాగస్వామ్యంలో అభివృద్ధి లో మన రికార్డులకు మనమే బ్రేక్ చెయ్యాలని జగదీష్ రెడ్డి అన్నారు.