Bandi Sanjay: అమరుల ఆకాంక్షలు నేరవేరేది కాషాయ జెండాతోనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అమర వీరుల ఆకాంక్షలు బీజేపీ ఆధ్వర్యంలోని కాషాయ జెండాతోనే నేరవేరతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..తెలంగాణ అమర వీరులను స్మరించుకున్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారందరికీ అభినందనలు తెలిపారు.
కేసీఆర్ కుటుంబ పాలనలో తెలంగాణ ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్పూర్తితో ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణ అమరు వీరుల ఆకాంక్ష కోసం బీజేపీ సాగిస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కేవలం ఒక్క కుటుంబం వల్లే వచ్చిందనే ధుష్ప్రచారం జరుగుతోందన్నారు.
Also Read
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీజేపీ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. తెలంగాణలో యువకుల బలిదానాలను ఆపేందుకు బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ చేసిన క్రుషిని కొనియాడారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతివ్వకపోతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించేదే కాదని అన్నారు. బీజేపీ ఏనాడూ పేరు కోసం పనిచేయలేదని. త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగుతోందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు కాషాయ జెండాతోనే సాధ్యమన్నారు. ఈ విషయాన్ని గమనించే ఉద్యమకారులంతా బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.
పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ప్రగతి భవన్ కేవలం ఒక కుటుంబం ప్రగతికే పరిమితమైందన్నారు. చివరకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా పరిహసిస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అరాచకాలను పాతరేసేందుకు బండి సంజయ్ సారథ్యంలో బీజేపీ అలుపెరగని పోరాటాలను యావత్ దేశం చూస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో.. తమిళనాడు రాష్ట్ర వ్యవహారాల సహాయ ఇంఛార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, కోశాధికారి శాంతికుమార్, మహిళా మోరోచా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి హాజరయ్యారు.
తాజావార్తలు
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!