తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియమాకాలని… ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయని.. తెలంగాణ లో శాంతి భద్రతలు కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దేశం లలో మహబూబ్ నగర్, అనంతపురం లో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ…
నేడు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ సభలో ప్రారంభించారు. అయితే కేసీఆర్ చెప్పినవన్నీ అబద్దాలేనని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకంపై అసెంబ్లీలో చర్చ చేపట్టే ధైర్యం కేసీఆర్ ఉందా? అని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 18 న కాంగ్రెస్ దళిత దండోరా సభ.. ఆ తర్వాత హుజురాబాద్ పై దండ ఎత్తుతాం.. కేసీఆర్ పెట్టిన స్థలంలోనే కాంగ్రెస్ సభ పెడుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.…
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత, గిరిజన 30 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇస్తే మేము సహకరిస్తామని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తెలిపారు. అల.. చేస్తే ఎక్కడ సంతకం పెట్టాలి అంటే అక్కడ పెడతామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 18 లక్షల ఎకరాల భూ పంపిణీ చేస్తే.. కేసీఆర్ వచ్చిన తర్వాత 2 లక్షల ఎకరాల భూమిని దళితులు, గిరిజనుల నుంచి గుంజుకున్నారని…
దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని అన్ని దళితు కుటుంబాలకు విడతల వారీగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు.. రైతు బంధు తరహాలో దళితబంధు అమలు చేస్తామని.. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న దళిత కుటుంబానికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్టు వెల్లడించారు.. అయితే, దళితబంధు కాదు.. చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోతావు అంటూ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. దళితులకు సంబందించిన 30వేల కోట్ల రూపాయలని కమీషన్ల…
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కమలాపూర్ మండలం దేశరాజుపల్లి గ్రామం నుండి వివిధ పార్టీలకు చెందిన 100మందికి పైగా నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములవ్వాలనే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… దళితబంధు పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఎవరు అలాంటి దుష్ప్రచారాలను నమ్మవద్దు. బీజేపీ పార్టీ వాళ్ళు దళితబంధు ఆపాలని కుట్రలు…
స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రజల చేత ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ శ్రవణ్ పై స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, ఆయన అనుచరులు బీర్ బాటిల్ తో, రాడ్లతో దాడి చేశారని బండి సంజయ్ ఫైర్ అయ్యారు. లోకల్ ఎమ్మెల్యే మైనంపల్లి గుండాయిజం చేస్తున్నాడని… రేపటి నుండి ఆయన కబ్జాలు అన్ని బయటకు తీస్తామని హెచ్చరించారు. మర్డర్ లు చేయగానే పోటుగాడు అవుతాడా..? బీజేపీలో చేరతా అని వచ్చాడు ఇలాంటి వాడే అని మేము దగ్గరికి తీయలేదన్నారు..పేదోళ్లను ఇబ్బంది పెడుతున్నాడు…
సిరిసిల్ల జిల్లాలో గతంలో చూడలేని అభివృధ్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు మంత్రి కేటీఆర్… 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నఆయన.. జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. సిరిసిల్ల జిల్లాలో సమారు లక్షా 16వేల 577 మంది రైతులకు 812 కోట్ల రూపాయలను ముందష్తు పంట పెట్టుబడి క్రింద రైతుల ఖాతాలలో ప్రభుత్వం నేరుగా జమ చేసిందన్నారు.. ఋణమాఫీ సంబంధించి జిల్లాలో 25 వేల రూపాయలు ఋణం తీసుకున్న 10,289 మంది రైతులకు…
కమలాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ… దేశ చరిత్రలు ముఖ్యమంత్రి ఆలోచించని గొప్ప పథకం దళిత బంధు పథకం అని దళిత జాతి ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి విద్యారంగంలో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించి… ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఈ పథకం హుజూరాబాద్ నియోజకవర్గం లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇక్కడ అమలు జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన దళిత కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేస్తారు. కావాలని బీజేపీ…
దళిత బందు పైన దుష్ప్రచారం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా కండిస్తున్న.. అని చెప్పిన టీఆర్‌ఎస్ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దళితబంధు పూర్తిస్థాయిలో అమలు చేయకపోతే టీఆర్‌ఎస్‌కే నష్టమని అన్నడం చర్చకు దారి తీసింది ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు ఆర్థికసాయం అందించలేకపోవచ్చన్నా కడియం దశల వారికి అందరికి ఆడుతుంది.. ఒకవేళ అందకపోతే మాత్రం టిఆర్ఎస్ కి నష్టమే అన్నారు. కానీ సీఎం అని ఆలోచించే దళిత బందువును ప్రవేశపెట్టారు అన్నారు. . దళితబంధు…
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసుకోండి జెండా ఎగర వేసేందుకు, ర్యాలీ తీసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోం. ఏ దేశంలోనూ ,ఏ రాష్ట్రంలోనూ జాతీయ పథాకాన్ని ఎగరవేసేందుకు అనుమతి కోరరు. గోషామహల్ నియోజక…