తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. కొత్త కార్యవర్గం ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పెద్దలు తెలంగాణ టూర్‌కి రెడీ అవుతున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది. వరంగల్‌లో లేదా మహబూబాబాద్‌లో రాహుల్ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇచ్చే సమయాన్ని బట్టి డేట్ మారే అవకాశం ఉందని తెలంగాణ పీసీసీ నేతలు చెప్తున్నారు. Read Also :…
దళిత బంధు కింద కేసీఆర్ ఇస్తామని చెప్తున్న 10 లక్షలు ఆయన సొంత డబ్బు కాదు అని చెప్పిన భట్టి విక్రమార్క ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక భాగం మాత్రమే అన్నారు. దీన్ని ఏదో ఒక్క నియోజక వర్గంలో పరిమితం చేయొద్దు. రాష్ట్రమంతా ఈ పథకాన్ని అమలు చేయాలి అని తెలిపారు భట్టి. కో ఆర్డినెటర్లు నియోజక వర్గాలలో ఈ విషయాలను బాగా విస్తృత ప్రచారం చేయాలి అని సూచించారు. నియోజక…
కొత్తగా వచ్చిన పథకాలు చేతినిండా వారికి పని కల్పిస్తున్నాయి. కానీ.. వైరిపక్షం చేసే విమర్శలకే కౌంటర్లు ఇవ్వడం లేదట. కొందరే స్పందిస్తున్నారట. మిగతా వారి సంగతేంటో తెలియడం లేదు. వాళ్లది మౌనమా.. వ్యూహమా కూడా అర్థం కావడం లేదట. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఈ చర్చే సాగుతోంది. ప్రవీణ్‌కుమార్ విమర్శలకు కొందరే కౌంటర్ ఇచ్చారా? తెలంగాణలో కొత్తగా రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ పొలిటికల్ కలర్స్ మారుతున్నాయి. మాజీ ఐపీఎస్ ప్రవీణ్‌కుమార్…
బండి సంజయ్ బండరాం బయటపెడుతానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సవాల్ విసిరారు. బండి సంజయ్ మీద కరీంనగర్ నుండి మాకు వందలాది కాల్స్ వస్తున్నాయని… బండి సంజయ్ ని ఎంపీ పదవి నుండి దింపే వరకు ఊరుకోనని హెచ్చరించారు.. పూర్తి ఆధారాలతో బండి సంజయ్ పై మీడియా సమావేశం పెడుతానని… తాను భయపడే వ్యక్తి ని కాదు…బయపడితే రాజకీయాల్లో ఉండలేనన్నారు. దళితుల పై దాడి చేశానని అంటున్నారు… తాను ఎక్కడా లేను సిసి టీవీ ఫుటేజ్…
ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని వైరివర్గాల ఎత్తుగడలతో పవర్ కట్ అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయన మనుగడే కష్టమైందని టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? అధికార పార్టీలో ఎవరితో పడటం లేదు? ఎమ్మెల్యే చిరుమర్తి చేరిక తర్వాత వీరేశానికి కష్టాలు? వేముల వీరేశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే. 2014లో టీఆర్ఎస్ టికెట్‌పై…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ రవీందర్ నాయక్.. దళిత బంధు పథకాన్ని స్వాగతించిన ఆయన.. వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయినట్లు ఉంది కేసీఆర్ వైఖరి అంటూ ఎద్దేవా చేశారు. దళిత గిరిజనులను… తెలంగాణ పేదలను మోసం చేసి హుజురాబాద్ లో గెలిచేందుకు ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ఓ చీటర్.. ఏడేళ్లుగా అందరినీ మోసం చేస్తున్నారని విమర్శించారు.. తెలంగాణ మేధావులు. రాజకీయ నాయకులు దీనిపై…
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ఇప్పట్లో జరిగేనా? ఆలస్యమయ్యే కొద్దీ ఏ పార్టీకి లాభం.. ఏ పార్టీకి నష్టం? జరుగుతున్న పరిణామాలు ఎవరి కొంప ముంచుతాయి? రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్! హుజురాబాద్‌పై మూడు ప్రధాన పార్టీల ఫోకస్! మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌కు ఉపఎన్నిక షెడ్యూల్ ఇంకా రాలేదు. కానీ.. రాజకీయాన్ని రంజుగా మార్చాయి పార్టీలు. గెల్లు శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. ఈటల రాజీనామా చేసినప్పటి నుంచే అక్కడ…
తాను ఎప్పుడూ పేదల ప్రజల పక్షాన కొట్లాడే బిడ్డనేనని .. సీఎం కేసీఆర్‌తో అనేక అంశాలపై పెనుగులాడానని గుర్తుచేసుకున్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని కృష్ణ కాలనీలో ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈటల మాట్లాడుతూ.. పదవుల కోసం పెదవులు మూయొద్దని, కేసీఆర్ సీఎం అయిన తర్వాత అనేక అంశాలపై ఆయనతో పెనుగులాడానని.. బయటికి చెప్పకపోయినా, అంతర్గతంగా కొట్లడానని..…
అధికారపార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే సడెన్‌గా దూకుడు పెంచారా? మాటల తూటాల వెనక మర్మం ఏంటి? గతంలో తనపై జరిగిన ప్రచారం మళ్లీ ఎదురు కాకుండా జాగ్రత్త పడుతున్నారా? ఇంతకీ ఆయనది యాక్షనా.. రియాక్షనా? ఎవరా ఎమ్మెల్యే? మల్కాజ్‌గిరిలో మైనంపల్లి వర్సెస్ బీజేపీ! గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్‌గిరి ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయ రణ క్షేత్రంగా మారిపోయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టిఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అది రెండోరోజూ కంటిన్యూ…
హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ బరిలో దిగుతారా? పోటీకి ఆమె సుముఖంగానే ఉన్నారా? మరి.. పరకాల, వరంగల్ తూర్పు నియోజకవర్గాల్లో కొండా అనుచరుల పరిస్థితి ఏంటి? ఉపఎన్నికలో పోటీ వెనక కొండా దంపతుల ఎత్తుగడలు వర్కవుట్ అవుతాయా? ప్రయోగం ఫలితాన్నిస్తుందా? కొండా సురేఖ బరిలో ఉంటే త్రిముఖ పోరుగా కాంగ్రెస్ అంచనా? తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే…