తెలంగాణ ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియమాకాలని… ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ వచ్చినప్పుడు చాలా అనుమానాలు ఉన్నాయని.. తెలంగాణ లో శాంతి భద్రతలు కి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు దేశం లలో మహబూబ్ నగర్, అనంతపురం లో ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవని గుర్తు చేశారు. 24 గంటలు కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని… దేశంలో ఒక్క తెలంగాణ లోనే ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తున్నామని తెలిపారు.
గతంలో వర్షాలు,బోరులు మీద ఆధారపడి వ్యవసాయం చేయాల్సి వచ్చేదని… దేశంలోనే అత్యధికముగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ ను కేంద్రం గుర్తించిందన్నారు. రైతు బంధు కోసం రెండు సీజన్ల లలో కలిపి 62 లక్షలు మంది రైతులు కు 15 లక్షలు కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ లో రైతు ఆత్మహత్యలు తగ్గాయని…ఉమ్మడి రాష్ట్రంలో అడవులు 23 శాతం ఉంటే హరిత హారం ద్వారా ఇప్ప్పుడు 28 శాతం కు పెరిగాయని గుర్తు చేశారు. ఏడేళ్లుగా సవాళ్లను అధిగమంచి పని చేస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.