హుషారుగా మాజీ మంత్రి ఈటలతో పాటు విమానం ఎక్కి.. ఢిల్లీలో బీజేపీ చేరిన నేతలు.. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి బైబై చెబుతున్నారు.. తాజాగా, ఈటల ప్రధాన అనుచరుడిగా పేరున్న టి.స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినా.. మేం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాం అన్నారు.. అందుకే…
సీఎం కేసీఆర్ పై మరోసారి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. మూడు చింతలపల్లి గ్రామాన్ని కెసిఆర్ దత్తత తీసుకొని ఏం చేయలేదని మండిపడ్డ రేవంత్ రెడ్డి.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. అందుకే మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపిస్తామన్నారు. దీక్ష సమయంలో నైట్ దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. ఈటెల రాజేందర్ బీజేపీ లో…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్.. ఆయనకు గుడ్‌బై చెప్పేశారు.. వీరిలో పింగిలి రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటల రాజేందర్.. తన పాత అనుచరులతో కపులుపుకుని.. బీజేపీ శ్రేణులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.. కానీ, అప్పుడప్పుడు కొందరు ఈటలకు షాక్…
హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా…
అధికారపార్టీలో అంతా ఉపఎన్నికపై ఫోకస్ పెడితే.. ఇటీవలే కండువా మార్చిన ఆయన మాత్రం ఇంకేదో షో చేస్తున్నారట. ఒంటరిగా వదిలేస్తే.. ఎక్కడ తలనొప్పులు తెచ్చిపెడతారో అని భయపడి.. ఆయన్ని వెంటేసుకుని మరీ తిరుగుతున్నారట సీనియర్ నాయకులు. పైగా బైఎలక్షన్‌ను వదిలిపెట్టి.. సొంత భవిష్యత్ కోసం భారీ స్కెచ్‌లు వేస్తున్నారట ఆ నాయకుడు. ఇంతకీ ఎవరాయన? ఏమా కథ? కౌశిక్‌రెడ్డి చేరినప్పుడు హుజురాబాద్ టీఆర్ఎస్ శ్రేణులు గుర్రు! హుజురాబాద్ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్‌ఎస్. ఈటల రాజేందర్ రాజీనామా…
సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జీతాలు ఇవ్వలేని సీఎం కేసీఆర్ దళితబంధు ఎలా ఇస్తాడో చెప్పాలని… ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ పనిచేస్తాడని నిప్పులు చెరిగారు. దళితబంధు పేరుతో మరోసారి దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని… 2023లో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను తీవ్ర అన్యాయమన్నారు. పాలన గాలికొదిలేసి కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని… కరోనా…
చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.. యూత్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై చేస్తున్నారు.. కేసీఆర్ అక్రమాలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.. సీఎం కేసీఆర్ కులాలలను విడదీసే కుట్ర చేస్తున్నారని ఫైర్ అయిన మధు యాష్కీ..…
మరో ఇరవై ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుంది.. కేసీఆరే ముఖ్యమంత్రిగా వుంటారు అని స్పష్టం చేశారు టీఆర్ఎస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి.. తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. కిషన్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.. బీజేపీ వాళ్లు పగటి కలలు కంటున్నారు.. అధికారంలోకి వస్తాం అంటూ బీజేపీ నేతలు భ్రమల్లో ఉన్నారని.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎక్కడైనా తెలంగాణలో అమలు అవుతున్న ఒక్క పథకమైన…
జన చైతన్య ఆశీర్వాద యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… ప్రధాని మోడీ నాపై నమ్మకం తో 3 శాఖలు అప్పగించారు. స్వాతంత్య్రము వచ్చాక ఎన్నడూ లేని విదంగా కేంద్ర మంత్రివర్గం లో బడుగు బలహీన వర్గాలకు చోటు కల్పించారు. ప్రజలకు దగ్గర అయ్యేందుకే ఈ జన ఆశీర్వాద యాత్ర చేపట్టాను. ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలి. ఇంకా 200 దేశాలను కరోనా వ్యాధి పట్టి పీడిస్తుంది. గతంలో ఇతర దేశాల నుండి మందులు…
తెలంగాణ క్యాబినెట్‌లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యం దక్కతోబోతుందా? ఒకరు కాదు.. ఇద్దరికి అవకాశం ఉంటుందా? ఎవరెవరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? కేబినెట్‌లోకి దళిత ఎమ్మెల్యేలను తీసుకుంటారా? తెలంగాణ కేబినెట్ నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ తర్వాత మంత్రివర్గంలో ఎవరికి అవకాశం దక్కుతుందా అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ సర్కారు దళిత బంధు స్కీమ్‌ను అమలులోకి తీసుకొచ్చింది. మంత్రివర్గంలో కూడా ఇద్దరు దళిత సామాజికవర్గ ఎమ్మెల్యేలకు చోటుదక్కే అవకాశం…