తెలంగాణ రాష్ట్రంలో లక్ష ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చుకున్నామని… త్వరలో మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జమ్మికుంట పట్టణంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్, తన్నీరు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మహిళ సంఘాలకు రెండు కోట్ల 13లక్షల 48వేల వడ్డి లేని రుణాలు ఇవ్వడం సంతోషంగా ఉందని.. బతుకమ్మ పండుగకు మరో కోటి 50లక్షలు అందిస్తామన్నారు. విద్య, వైద్యం, మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని… రెండు వందల పెన్షన్ ను రెండు వేల పెన్షన్ చేసుకున్నామని తెలిపారు. 57ఏళ్లు నిండిన వారికి కూడ పెన్షన్ ఇచ్చుకో బొతున్నామని… 57ఏళ్లు నిండిన వారికి ఇస్తే నాలుగు లక్షల మందికి కొత్త పెన్షన్లు వస్తాయని వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని విధాలుగా వసతులను పెంచిన ఘనత కేసీఆర్ దని స్పష్టం చేశారు.