టీఆర్ ఎస్ పార్టీ పై మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఫంక్షన్స్ ఉన్నాయనే టీఆర్ ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ,టీఆర్ ఎస్ పార్టీలు ఒక్కటేనని… పార్లమెంట్ లో టీఆర్ ఎస్ కు కాంగ్రెస్ మద్దత్తు ఇచ్చిందని మండిపడ్డారు. గతంలో ఆ రెండు పార్టీ లు పొత్తు పెట్టుకున్నాయని.. సీఎం సంతకాలు చేసేటప్పుడు సోయిలో ఉండి చేయాలన్నారు. కృష్ణా జలాల విషయంలో సంతకం పెట్టాడు……
తెలంగాణపై బీజేపీకి ఉన్న వ్యతిరేక భావన బయటపడిందని టీఆర్‌ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. గుజరాత్‌లో ఉన్న గనులు.. ప్రభుత్వ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు ఇవ్వాలంటే వెంటనే ఇచ్చేసింది. కానీ తెలంగాణలో బొగ్గు బ్లాకులు మాత్రం ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వడం లేదన్నారు. బొగ్గు బ్లాకులు ఇక్కడి ప్రభుత్వానికి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వలేదన్నారు. తెలంగాణలో సింగరేణి…
మెదక్ నియోజకవర్గం లో టీఆర్ఎస్ కి ఏకగ్రీవం కావొద్దనే కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టాము అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని పెట్టాము. మాకు 230 ఓట్లు ఉన్నాయి. .మేము గెలిచే అవకాశం లేదు. కానీ మా ఓట్లు మేము వేసుకోవాలని అనుకున్నాం. మేము అభ్యర్థి ని ప్రకటించగానే హరీష్ రావు ఉలిక్కి పడ్డారు. క్యాంప్ లు పెట్టాల్సింది మేము… కానీ టీఆర్ఎస్ వాళ్ళు భయంతో క్యాంప్ లు…
టీఆర్‌ఎస్‌లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోనే టీఆర్‌ఎస్ నేతలు మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారికి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాల మధ్య గత కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ విషయం స్థానిక నేతలకు తెలిసినా వారి మధ్య సంది కుదిర్చేందుకు సహాసించలేదు. అయితే నేడు సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరు వర్గాల నేతల…
అందోల్ లో కాంగ్రెస్ పార్టీ విధానాలపై ఆరోపణలు చేసారు ఎమ్మెల్యే క్రాంతికిరణ్. టీఆర్ఎస్ రెండవ సారి గెలిచిన తర్వాత మూడు సంవత్సరాలు దామోదర్ ప్రజల్లోకి రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఎలా జరుగుతుందో అన్న విషయం దామోదర తెలుసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి జరుగుతున్న అభివృద్ధిపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ప్రవేశ పెట్టిన పథకాలు లీడర్ల జెబుల్లోకి వెళ్ళేవి..టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేరుగా ఆన్ లైన్ ద్వారా…
స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికలు నేడు తెలంగాణలో జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే పలు స్థానాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఖమ్మంలో కూడా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమతమ అభ్యర్థులను బరిలోకి దించాయి. అంతేకాకుండా కావాల్సినంత ప్రచారం కూడా చేశాయి. అయితే నేడు ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ ఖమ్మం పోలింగ్ సెంటర్ వద్ద సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేశారు. గంటల…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పెద్దపల్లి జిల్లా పోలింగ్ కేంద్రంలో స్వల్వ ఉద్రిక్తత నెలకొంది… పెద్దపల్లి జిల్లా బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కి టీఆర్ఎస్ ఓటర్లకు మధ్య వాగ్వాదం జరిగింది.. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో ప్రజాప్రతినిధులు వరుసక్రమంలో ఉండగా.. ఇద సమయంలో ఓదెల మండలం కొలనూరు బీజేపీ ఎంపీటీసీ శ్రీనివాస్‌కు, టీఆర్ఎస్ ఎంపీటీసీ ఓటర్లకు మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది.…
2016-17 తరువాత నుండి రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి లభించింది. వర్కర్ టు ఓనర్ పథకం ను 400 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దాదాపుగా 1,334 కోట్ల రూపాయల ఆర్డర్లను ఇచ్చాం. సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్, రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం స్పందన లేదు. 12 వందల ఎకరాల్లో వరంగల్ లో ఏర్పాటు చేయబోతున్న మెగా టెక్స్ టైల్…
సిద్ధిపేట డిగ్రీ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి హరీష్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు చాలా ప్రాముఖ్యమైందన్నారు. కాగా మొదటి సారి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించిందని తెలిపారు. జిల్లాలో దాదాపు 99 శాతం ఓటింగ్ జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని చేసినా…