ఇప్పుడు దేశ ప్రజలందరి చూపు తెలంగాణ సీఎం కేసీఆర్ పైనే ఉంది.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేం సిద్ధంగా ఉన్నామని తెలిపారు ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్.. హనుమకొండ జిల్లా మడికొండలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.. ఈ సమ్మేళనంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్, కార్పొరేటర్లు, ఇతర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మా…
ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు రేవంత్‌రెడ్డి.
కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉపాధి అవకాశాలు కోసం అనేక శిక్షణ కేంద్రాలపై ఆధార పడుతున్నారని తెలిపారు. క్యాంపస్ లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని అన్నారు. మూస పద్దతిలో కాకుండా డిమాండ్ కి తగ్గట్టు చదివే పరిస్తితి ఉందని అన్నారు.
తెలంగాణలో రాజకీయ రంగ ప్రవేశం, పోరు కొనసాగుతోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేయడంతో పాటు పార్టీని బలోపేతం చేసేందుకు, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని బీజేపీ కసరత్ షురూ చేస్తోంది.
ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గవర్నర్ తమిళిసై పై మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ అర్వింద్ ఒక ఫేక్ ఫ్రాడ్ ఎంపీ అంటూ ఆరోపించారు.
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించింది.. దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది.. అయితే, ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఆయనకు బెదిరింపులు రావడంతో.. అదనపు భద్రత కూడా కేటాయించారు.. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం జరిగిన 20 రోజుల తర్వాత తొలిసారి రేపు సొంత నియోజకవర్గం తాండూరుకి రాబోతున్నారు ఎమ్మెల్యే…