మరోసారి బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. తాజాగా ఆయన సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మండలం బూర్గుపల్లిలో డబుల్ బెడ్ రూమ్ గృహా ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన 45 మంది లబ్ధిదారులకు గృహా ప్రవేశాలు చేయించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సద్దితిన్న రేవు తలవాలి.. నియ్యత్ ఉంటేనే బర్కత్ ఉంటదని వ్యాఖ్యానించారు. గత గజ్వేల్ పాలకులు సంజీవరావు, గీతారెడ్డి, నర్సారెడ్డి హయాంలో జరగని అభివృద్ధి, సీఎం కేసీఆర్ హాయంలో దేశానికే ఆదర్శంగా గజ్వేల్ అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఇండ్లకు 40 వేల రూపాయలు ఇస్తే బేస్మెంట్ కి కూడా సరిపోయేదికాదని ఆయన అన్నారు.
Also Read :Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల వడ్లు కొనమంటే నూకలు బుక్కండని అవహేళన చేసిందని ఆయన మండిపడ్డారు. నూకలు బుక్కమన్న బీజేపీ పార్టీ వాళ్ళు గ్రామాల్లో తిరిగితే వారి తోకలు కత్తిరించండని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేదలకు అన్నీ ఉచితంగా పంచుతుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం అన్నీ పెంచుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటు పడే ప్రభుత్వమని, మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్‌కు వెన్నంటే ఉండాలని, ఆయనకు మన అండకావాలన్నారు. గత ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి కేసీఆర్ సీఎం అయ్యాక సాధ్యమవుతోందన్నారు. సాధ్యంకాదు అన్నవారే ఇప్పుడు ముక్కునవేలేసుకుంటున్నారన్నారు మంత్రి హరీష్‌రావు.
Also Read : Kishan Reddy : బీజేపీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు అవుతారో, ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పలేము