ఖమ్మం వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో సభలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు రెండు రాజ్యసభ్యులను ఇవ్వడం చరిత్ర అని ఆయన అన్నారు. సంపాదించే వాళ్లూ చాలా మంది ఉంటారు కానీ పార్థసారధి రెడ్డి సంపాదన కుటుంబ సభ్యులతో పాటు ఖమ్మం జిల్లాకు అభివృద్ధికి కేటాయించే విశాల హృదయం ఉన్నటువంటి వారన్నారు. ఎంత ఎదిగినా ఓదిగి ఉంటే లక్షణం ఉన్న గొప్ప వ్యక్తి బండి పార్థసారధి రెడ్డి అని ఆయన అన్నారు. పార్థసారధి రెడ్డిని చూసి చాలా నేర్చుకోవాలని ఆయన కొనియాడారు. హెరిటోడ్రగ్ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడిన వ్యక్తి పార్థసారధి రెడ్డి అని ఆయన అన్నారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి పక్క రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రం డెవలప్‌మెంట్ ఎక్కువగా ఉందని, రాబోయే రోజుల్లో కేసిఆర్ కు మనం అందరం అండగా ఉండాలన్నారు. అయితే ఇదిలా ఉంటే.. నిన్న ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో రాజ్యసభ సభ్యులు బండి పార్ధ సారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్రలకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
Also Read : Twitter Poll: ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాలా?.. పోల్ ఏర్పాటు చేసిన మస్క్
ఈ కార్యక్రమంలో నామా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. మన రాష్ట్రం లో పధకాలను దేశమొత్తం పెట్టాలని పార్లమెంట్ లో పొరడాను. రాష్ట్రం ముందు కు వెళుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు బాగుంటునే అందరూ బాగుంటారు అని అభివృద్ధి చేస్తే కొంత మంది అవక్కాలు చవక్కాలు పెలుతున్నారు. రైతు పండించిన పంట కొనలేకపోయ్యారు ఇక్కడకు వచ్చి మాయ మాటాలు చెబుతున్నారు. కేసిఆర్ మనల్ని పొట్టలో పెట్టి చూసుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు అండగా ఉన్న పార్టీ టి.ఆర్.ఎస్.పార్టీ… మన ముఖ్యమంత్రి కేసిఆర్. మాయ మాటలు చెప్తున్న పార్టీ లకు బుద్ది చెప్పాలి. భద్రాచలం నుండి కొవ్వురు కి రైల్వే లైన్ సెంక్షన్ అయితే సత్తుపల్లి వరకే ఆపారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. రైల్వే లైన్ కు మెజారిటీ డబ్బులు మనవే. కల్లబోల్లి మాటాలు చెప్పే పార్టీలకు బుద్ది చెప్పాలి. మన నాయకుడుకి అడుగులో అడుగు వేసి అండగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు.