Sabitha Indra Reddy: కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాజ్ డెక్కన్ హోటల్ లో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆద్వర్యంలో TCS ION, TS Online సహకారంతో ఉన్నత విద్యలో ఎంపవరింగ్ ఎడ్యుకేషన్ టు ఆగ్మెంట్ ఎంప్లాయబిలిటీ” అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జయేష్ రంజన్ , ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్స్, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డాక ముందు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని పేర్కొన్నారు. లక్షల మంది చదువులు అయిపోయి బయటికి వస్తున్నారని అన్నారు.
Read also: Joe Biden Birthday: జో! ఐ లవ్ యు.. అమెరికన్ ఫస్ట్ లేడీ స్పెషల్ విషెస్
ఉపాధి అవకాశాలు కోసం అనేక శిక్షణ కేంద్రాలపై ఆధార పడుతున్నారని తెలిపారు. క్యాంపస్ లోనే చదవాలని విద్యార్థులు కోరుకుంటున్నారని అన్నారు. మూస పద్దతిలో కాకుండా డిమాండ్ కి తగ్గట్టు చదివే పరిస్తితి ఉందని అన్నారు. ఇదే విషయం సీఎం కేసిఆర్ చెప్తున్నారని పేర్కొన్నారు. ఐటీ పాలసీలు మార్చుతూ కేటీఆర్ కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. కేటీఆర్ కృషితో 1500 కంపెనీలు హైదరాబాద్ కి వచ్చాయని గుర్తు చేశారు. 7లక్షల మంది జాబులు చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాలు అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన అని తెలిపారు. కేసిఆర్ ఆశల మేరకు మన వంతు కృషి చేస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు.
CM Jagan Narsapuram Tour Live Updates: సీఎం జగన్ నర్సాపురం పర్యటన.. లైవ్ అప్ డేట్స్