బీజేపీపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిత్యం చేస్తున్న నిరాధారమైన ప్రకటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ బీజేపీ బాధ్యతారాహిత్యమని మంత్రి హరీశ్ ఆరోపణలు చేయడం రాజకీయ దూషణలు నిరాధరమైనవని ఆయన అన్నారు. Read Also:దళితుల ఆలయప్రవేశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే…
తెలంగాణలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది.. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు కోవిడ్ బారినపడ్డారు.. మరోవైపు.. సినీ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ఇలా చాలా మందికి కోవిడ్ సోకింది.. తాజాగా, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో… మంత్రులు, ఇతర నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే.. జిల్లాలో పంట నష్టంపై తాజాగా, మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. సీఎం వాక్సిన్ తీసుకున్నాడో లేదో తెలియదని, వాక్సిన్ తీసుకొమ్మని చెప్పడు, బీజేపీ ఒత్తిడితో గాంధీ హాస్పిటల్‌కి పోయిండు అని ఆయన అన్నారు. టైమ్ పాస్ కోసం కేబినెట్ మీటింగ్ పెట్టిండని, 317 జీఓపై కేబినెట్ లో చర్చించక పోవడం దుర్మార్గమని ఆయన అరోపించారు. ఉద్యోగులు వాళ్ల చావు వాళ్ళు చావాలని కేసీఆర్ అనుకుంటున్నాడా అని ఆయన విమర్శించారు. 317 జీఓను సవరింవే వరకు…
బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ…
తెలంగాణలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు జనగామ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. తెలంగాణలోని పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే.. మన దేశం అభివృద్ధిలో అమెరికాను దాటుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాల లాంటివి బీజేపీ పాలిత ప్రాంతాల్లో అమలు చేస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.…
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. Read Also: అన్నదాతలు సుభిక్షంగా ఉంటే సమాజం బాగుంటుంది: మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను వెంటనే చెల్లించాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా బీసీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్పులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.3 వేల కోట్లు ప్రభుత్వం బకాయి పడిందని మండిపడ్డారు. ఫీజులు కట్టాలంటూ విద్యార్థులపై కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు 14 లక్షల మంది బీసీ విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని…
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్‌పై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడులకు దిగారు. అయితే ఈ సారి ప్రభుత్వంతో పాటు మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలియనిది అడిగితే పాపం KTR ఏమని సమాధానం చెప్తారు? అసలు అడగాల్సింది..మద్యం అమ్మకాలను పెంచడం ఎలా? ఆడవాళ్ల మానప్రాణాలకు హాని కలిగించడం ఎలా? జనాలను డ్రగ్స్‌కు బానిస చెయ్యడం ఎలా? రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం ఎలా? నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనేలా…
ఇటీవల కేంద్రం ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర నిర్ణయంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. దేశానికి అన్నం పెట్టే రైతును ఇంత గోస పెడతారా…? పండగ పూట ఎరువుల ధరలు 50% నుండి 100% కు పెంచుతారా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక దుర్మార్గపు చర్యలను ఎక్కడికక్కడ నిలదీయాలని, రాష్ట్ర బీజేపీ నాయకులు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని తమ కేంద్ర నాయకత్వాన్ని…