తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యుని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పుణ్యకాలమని.. ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో…
మా సుపరిపాలన-సుస్థిరతే బీజేపీ ద్వేష పూరిత ప్రచారానికి సరైన సమాధానమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రాతినిథ్యం వహించడం నా అదృష్టమని కేటీఆర్ అన్నారు. ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ విమర్శల దాడులకు దిగారు. బీజేపీ విషపూరిత ఎజెండాను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు. ఓ నెటిజన్ జాతీయ రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి..? మిమ్ముల్ని భారతదేశానికి ఐటీ మంత్రిగా చూడాలనుకుంటున్నాం అంటూ ట్వీట్ చేయగా సొంత రాష్ట్రానికి…
కేసీఆర్‌కు జైలుకు వెళ్తే దేశమే భగ్గుమంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీని తీవ్ర స్తాయిలో విమర్శించారు. మా విధానాలు దేశానికి ఆదర్శం ఎందరో ఇతర రాష్ట్రాల ప్రతనిధులు మా విధానాలపై పరిశీలనకు వచ్చారు. ఐక్యరాజ్యసమితి లాంటి పెద్ద సంస్థలు కూడా తెలంగాణ అభివృద్ధి విధానాలు భేష్ అని కితాబిచ్చాయన్నారు. మీరు అధికారంలో లేనంత మాత్రానా మంచిగా పరిపాలనా చేసే వారిపై నిందలు వేయొద్దని, కేసీఆర్‌కు ఏమైనా అయితే…
దేశంలో పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్న బీజేపీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ రాసిన లేఖకు ప్రధాని వెంటనే జవాబు చెప్పాలన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలోనే రైతులు ఆనందంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఉపేక్షించేది…
ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలంటూ విజయశాంతి తీవ్ర స్థాయిలో కేసీఆర్ పై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రైతులు యాసంగి వరి సాగు చేయొద్దని చెప్పి… కాదని వేస్తే కొనుగోలు కేంద్రాలే ఉండవని సీఎం కేసీఆర్ హెచ్చరించారన్నారు. పంటకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు ఇస్తున్నామని వడ్ల ముచ్చటను మర్చిపోయేలా చేయడానికే, ఊరూరా రైతుబంధు సంబురాలు చేయాలని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేశారని విజయశాంతి మండిపడ్డారు.…
తెలంగాణ రైతులు మరణిస్తున్న కేసీఆర్‌కు సోయి లేదని షర్మిల నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రైతులు మరణిస్తున్నా కేసీఆర్ సర్కార్ ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న మీ మాట ఉత్తదైపోయింది. చివరి గింజ వరకు కొంటానన్నది ఊసే లేకుండా పోయిందంటూ ధ్వజమెత్తారు. పెట్టుబడి రాక రైతులు చస్తా ఉంటే మీరు సంబరాలు చేసుకొంటున్నారు. Read Also: తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉంది : తమ్మినేని వీరభద్రం…
బీజేపీ విచ్ఛిన్నకర విధానం అమలు చేస్తోందని, తెలంగాణకి బీజేపీతో ప్రమాదం పొంచి ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ఓటమి లక్ష్యంగా పని చేస్తామని అన్నారు. బీజేపీ పట్ల టీఆర్‌ఎస్ మెతక వైఖరి అవలంబిస్తోందని, ఈ మధ్య బీజేపీ ఒడిపోవాలని కేసీఆర్ స్టేట్ మెంట్ ఇస్తున్నారు.. సంతోషమేనని ఆయన అన్నారు. కానీ కేసీఆర్ ప్రకటనలే వస్తున్నాయి.. కానీ ఆయన స్టేట్ మెంట్ ఎక్కడ లేదని ఆయన పేర్కొన్నారు.…
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మరోసారి బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.. రైతాంగ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం విఘాతం కలిగిస్తోందంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మీరు రాసిన బహిరంగ లేఖ యావత్తు పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మండిపడ్డ ఆయన.. 317 జీవోను సవరించాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షాన బీజేపీ ఉద్యమాలు చేస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగ ఖాళీలను తక్షణమే భర్తీ…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల బండి సంజయ్ కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడడం బంద్ చేయాలంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేసీఆర్, కేటీఆర్ మీద చేయి వేస్తే తెలంగాణ ప్రజలు ఉరికించి కొడతారన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు కేసీఆర్ ను విమర్శిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఎరువుల ధరలు…