బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డితో కలిసి బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ ఈరోజు జూమ్ వీడియో కాన్ఫరెన్సు ద్వారా మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్.కుమార్ మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పై మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. బీజేపీ వైపు వేలు చూపించే ముందు టీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళిత, గిరిజనుల బతుకులు…
కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్ర్తీలు, మహిళలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించేందుకు అనిమీయా ముక్త్ భారత్ పేరుతో పథకాన్ని అమలు చేస్తుందని బీజేపీ నేత NVSS ప్రభాకర్ అన్నారు. అనీమియా ముక్త్ భారత్ పథకాన్ని తెలంగాణలో నీరుగార్చాలని రాష్ర్ట ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కోటి పదిలక్షల మందుల స్టిప్స్, వైద్యపరికారాలను సేకరించే టెండర్లలో కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా టీఎస్‌ఎంఐడీసీ వ్యవహారించింది. మేక్ ఇన్ ఇండియాను తుంగలో తొక్కి ఇతర దేశాల నుంచి వైద్య…
రాష్ట్రంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు కేంద్ర వాటాగా రాబోయే యూనియన్ బడ్జెట్‌లో రూ.7,778 కోట్లు కేటాయించాలని తెలంగాణ రాష్ట్రం కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో మంత్రి కేటీఆర్ కేపీహెచ్ బీ-కోకాపేట్-నార్సింగి కారిడార్, వరంగల్ మెట్రో-నియో ప్రాజెక్ట్‌తో పాటు మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (MRTS), మెట్రో నియో నెట్‌వర్క్‌తో సహా పలు ప్రాజెక్టులకు నిధులు కోరారు. స్ట్రాటజిక్…
దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ప్రాంతాల్లోని పంటల సాగు, ఇతర అంశాల ఆధారంగా కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) నిర్ణయించాలని, రాష్ట్రాలు నిర్ణయించిన ఎంఎస్‌పీకి కేంద్రం మొత్తం ఉత్పత్తులను కొనుగోలు చేయాలని వ్యవసాయ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలో 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగంపై కేంద్రం తన విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంటూ, “కేంద్రం ఎమ్‌ఎస్‌పిని ప్రకటించి, సేకరణ బాధ్యతల నుండి చేతులు కడుక్కుంటోంది. ఇది శోచనీయం.” స్వామినాథన్ కమిటీ సిఫార్సులను…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లిలో అయన నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అదానీ, అంబానీల చేతుల్లో పెట్టిన ఘనత బీజేపీకే దక్కిందని ఆయన విమర్శించారు. బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి దమ్ముంటే భారతదేశమంతా దళిత బంధు అమలు చేయించాలని మంత్రి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని…
బండి సంజయ్ పై మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శల దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు బీజేపీ ఏమైనా చేసిందా..? బండి సంజయ్ కి సవాల్ విసురుతున్న ..చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే కేంద్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో గిరిజనులకు, దళితులకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.బీజేపీ నేతలు గాలి మాటలు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు.…
సీఎం కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రైతుల పంట నష్టంపై నిలదీశారు. రాష్ట్రంలో పలు సమస్యలపై ఇటీవల వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు స్పందిస్తున్నారు. గతంలో నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్లు, రైతుల ఆత్మహత్యలు, వరి కొనుగోళ్లపై ప్రభుత్వాన్ని నిలదీసింది. తాజాగా ఇటీవల అకాల వర్షాలతో జరిగిన పంట నష్టం, పరిహారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. Read Also: రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్,…
రాష్ట్రంలో జరిగే దుర్మార్గ చర్యల వెనుక కేసీఆర్, మోడీ ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అశు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. అశు ఎర్రబెల్లి గెలుపు కోసం గతంలో పని చేశారన్నారు. ఎర్రబెల్లి గెలిచిన తర్వాత అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి సారించకపోవడం, ఉద్యోగ నోటిఫికేషన్‌లపై మంత్రి ఎర్రబెల్లి కేసీఆర్‌పై ఒత్తిడి తేకపోవడంతోనే ఎర్రెబెల్లిపై విసిగిపోయార్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. రైతుల సమస్యల పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు…
ఉద్యోగులు, టీచర్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఉసురు పోసుకుంటోందని మండిపడ్డారు. 317 జీఓ కారణంగా ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసి, సీనియర్, జూనియర్ల మధ్య ద్వేష భావాన్ని పెంచుతున్నారని ఆరోపించారు. 317 జీవో విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు సైతం నాటకాలు ఆడుతున్నారని సీతక్క అన్నారు. Read Also: బీజేపీపై హరీశ్‌రావు చేస్తున్న ప్రకటనలు నిరాధారమైనవి: కృష్ణ సాగర్…
‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం అమలుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అన్నారు. తెలుగు మీడియం పాఠశాలలు మూతపడతాయనే భయాన్ని పోగొట్టి, తెలుగు మాతృభాష అయినందున ఇంగ్లీషు మీడియం పాఠశాలలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. యథావిధిగా తెలుగు మీడియం కొనసాగుతుందని ఆయన తెలిపారు. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్‌లో తనను కలిసిన ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం ప్రతినిధులతో వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. సాగునీరు, విద్యుత్ రంగాలను అభివృద్దికి…