బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ఏర్పడ్డ తెలంగాణలో వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యం సూర్యాపేటలో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేటజిల్లాలో అకాల వర్షాల పట్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జగదీష్ రెడ్డి జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డితో సమీక్ష నిర్వహించారు. రెస్క్యూ చర్యలు చేపట్టాలంటూ మున్సిపల్, రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి పరిశీలించారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.