బీజేపీపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నిత్యం చేస్తున్న నిరాధారమైన ప్రకటనలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలల కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తెలంగాణ బీజేపీ బాధ్యతారాహిత్యమని మంత్రి హరీశ్ ఆరోపణలు చేయడం రాజకీయ దూషణలు నిరాధరమైనవని ఆయన అన్నారు.
Read Also:దళితుల ఆలయప్రవేశంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే పద్మావతి
వాస్తవంగా కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్రం తాను దాఖలు చేసిన 8 మెడికల్ కాలేజీ కేటాయింపుల్లో ఏడింటికి త్వరలో అనుమతులను పొందుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోపభూయిష్ట దరఖాస్తు ప్రక్రియ వల్ల రాష్ట్రానికి రావాల్సిన మరో కళాశాల జాప్యం, కేటాయింపు జరగలేదని కృష్ణ సాగర్‌రావు అన్నారు. తెలంగాణ బీజేపీ ప్రతిపక్షంలో ఉండి కూడా రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తోందని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మేము అన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో క్రమం తప్పకుండా చర్చిస్తున్నామని వెల్లడించారు. హారీశ్‌రావు రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని నిందించడం మానేసి తెలంగాణ ప్రజలకు మెరుగైనా సేవలు అందించేందుకు కృషి చేస్తే బాగుటుందని కృష్ణ సాగర్ అన్నారు .