హైదరాబాద్‌లో అత్యంత భద్రత నడుమ జరుగుతోన్న టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీలో ఓ వ్యక్తి కలకలం సృష్టించాడు.. ప్లీనరీలో ప్రత్యక్షమయ్యాడు మున్నూరు రవి.. అయితే, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న రవి… ప్లీనరీలో కనిపించడం చర్చగా మారింది.. మరోవైపు, హై సెక్యూరిటీ, బార్ కోడ్ పాసులు ఇచ్చినా.. ఎలా మున్నూరు రవి ప్లీనరీకి వచ్చారని అరా తీశారు పార్టీ శ్రేణులు.. కానీ, ఐడెంటిటీ కార్డ్ తోనే ప్లీనరీ హాల్‌లోకి ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొందరు టీఆర్ఎస్ పార్టీ నేతలతో మున్నూరు రవి ఫోటోలు దిగడం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: KTR: ప్రధానికి ఘాటుగా కౌంటర్.. ఇలా చేస్తే రూ.70కే లీటర్ పెట్రోల్..!