టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ పార్టీ పోతుందని స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాల్లో నెలకొన్ని సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైన అభివృద్ధి, దేశవ్యాప్తంగా వ్యాప్తి చేస్తామన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్, జలాలను కూడా దేశం వాడుకోలేకపోతోందని, ఇది ఎవరి ఆసమర్థత అని ప్రశ్నించారు.
అంతేకాకుండా ఓ రాష్ట్రంలో ఇప్పడిప్పుడే రాత్రి పూట కూడా అన్నం తింటున్నామంటుంటే.. మరో రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వగలుగుతున్నామంటున్నారు.. ఇదా భారతదేశ పరిస్థితి అని ఆయన ప్రశ్నించారు. అయితే కమ్యూనిస్టు పార్టీలు కేంద్రంలో బీజేపీని గద్దె దించేందుకు రావాలంటే.. టీఆర్‌ఎస్ పార్టీ రాదని స్పష్టం చేశానన్నారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశంలో రెండు పూటల అన్నం తినలేని స్థితిలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ఏంటీ పరిస్థితి..? అని ఆయన ప్రశ్నించారు.