దేశంలో బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీల నేతలు తనను కలిసి తమతో చేతులు కలపాలని కోరినట్లు ప్లీనరీలో సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే తాను వాళ్లతో రానని స్పష్టం చేసినట్లు వివరించారు. ఎవరినో గద్దె ఎక్కించేందుకు లేదా గద్దె దించేందుకు తాను పనిచేయనని చెప్పారు. గద్దె ఎక్కించాల్సింది రాజకీయ పార్టీలను కాదు అని.. ప్రజలను అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మారాల్సింది ప్రభుత్వాలు కాదని.. ప్రజల జీవితాలు అని…
బుర్ర ఉండా.. లేకనా.. తెలివి ఉందా.. లేకనా.. శక్తి సామర్థ్యత ఉండా.. లేక అసమర్థతోనా.. వివేకం ఉందా.. లేక అవివేకమా.. అంటూ టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ దేశంలో సజీవంగా ప్రవహించే నదులలో ఉన్నటువంటి నీటి లభ్యత 65 వేల టీఎంసీలు అని, ఇంకా 4-5 వేల టీఎంసీలు నీళ్లు టిబెట్ నుంచి రావాల్సి ఉందని, దానిపై ఇంకా లెక్కలు తేలలేదన్నారు. ఇప్పటికే లెక్కించబడి ఉన్న 65 వేల టీఎంసీల…
తెలంగాణ రాష్ట్ర సమితి 21వ అవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,01,035 మెగావాట్ల విద్యుత్ శక్తి అందుబాటులో ఉందన్నారు. ఆధునిక సమాజం మొత్తం అభివృద్ధికి సంకేతాలుగా, ప్రగతికి నిదర్శనాలుగా భావించే కొలమానం విద్యుత్ అని, అటువంటి విద్యుత్ శక్తి దేశంలో అందుబాటులో ఉన్నా.. దాన్ని వినియోగించలేని ఆశక్త స్థితిలో భారతదేశం ఉందన్నారు. 4…
టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రధాన కూడళ్లు గులాబీమయంగా మారాయి. టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో టీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడించారు. నేడు ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తరని పలు పత్రికలు, న్యూస్ చానెళ్లలో వస్తోందన్న కేసీఆర్.. 75…
టీఆర్‌ఎస్ 21వ ప్లీనరీ వేడుకలు హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో అంగరంగగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గులాబీ జెండావిష్కరణను సీఎం కేసీఆర్ గావించారు. అయితే అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 2 దశాబ్దాల క్రితం పరిస్థితులు అగమ్యగోచరంగా ఉంన్నాయన్నారు. ఏడుపొచ్చి ఏడుద్దామన్నా.. ఎవ్వరినీ పట్టుకొని ఏడువాలో తెలియని తెలంగాణ ప్రజల గుండె చప్పుడు నుంచి ఉద్భవించిన పార్టీయే టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాడు ప్రారంభమైన టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు…
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ వేదికగా అట్టహాసంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ సమావేశాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వచ్చారు. అయితే టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్ నాయకులు మినహా మరొకరులో లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు. టీఆర్‌ఎస్ నాయకులకు మాత్రమే ప్రత్యేకమైన బార్ కోడ్ కలిగిన పాస్‌లను జారీ చేశారు. ఈ హైటెక్ పాసులు ఉంటేనే సమావేశం లోపలికి ఎంట్రీ.. లేకుంటే ఎంతటి వారికైనా..…
టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకలకు ఏర్పాటు చేశారు. అయితే ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం ప్రజలకు ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు. బండి సంజయ్ దేనికోసం పాదయాత్ర చేస్తున్నాడో చెప్పాలన్నారు. నల్లధనం తీసుకువస్తామన్నారు, ఉద్యోగాలు ఉస్తామన్నారు, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు, ఇలా వీటిలో ఒక్కటైనా ఇచ్చిన హామీని నేరవేర్చారా అని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో…
రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు సంబురాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఆవిర్భవ వేడుకలు హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హెచ్‌ఐసీసీలో 4500 మందికి సరిపోయేవిధంగా ఏర్పాట్లను చేశారు. ఇప్పటికే హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణానికి ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొడుతోందన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం దేశానికే దశ దిశ చూపుతోందని ఆయన…
టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీకి పలు ప్రశ్నలు సంధించారు. సీఎంగా, టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ తన 8 ఏళ్ల పాలనలో ఏం ఒరగబెట్టారో మూడున్నరకోట్ల తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 8 ఏళ్ల పాలనలో జరిగిన వైఫల్యాలు, అవినీతి, నియంతృత్వ పోకడలు, ప్రజాస్వామ్య హననం, కుటుంబపాలన వంటి అంశాలను ప్రస్తావిస్తే కేసీఆర్ అసమర్థ పాలనపై వెయ్యి ప్రశ్నలు అడిగినా సరిపోదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతోనే…