మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన కామెంట్లు చేశారు. చిల్లర వ్యక్తుల గురించి పట్టించుకోవద్దు..ఓపిక పడితే రాజులు అవుతారు అన్నారు తుమ్మల. రాజకీయాల్లో కావలసింది ఓపిక… ఓపిక పడితే కార్యకర్తలే రాజులు అవుతారన్నారు. అందువల్ల కార్యకర్తలు ఓపిక తో వ్యవహరించాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు నియోజకవర్గంలో కార్యకర్తల తో ఆయన మాట్లాడుతూ పరోక్షంగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నుద్దేశించి వ్యాఖ్యానించారు. మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని, అయితే మనం…
మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డ ఆయన.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతికదాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు…
మంత్రులు.. ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తుంటే.. అధికారపార్టీ కేడర్ మాత్రం వారికి షాక్ ఇస్తోంది. నియోజకవర్గాలకు బాస్‌లమని చెప్పుకొంటున్న శాసనసభ్యులకు తాజా పరిస్థితులు మింగుడు పడటం లేదట. ఇటీవల జరిగిన పరిణామాలు MLAలను మరింత కలవర పెడుతున్నట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారపార్టీలో ఒక్కటే గుసగుసలు. భారీ ఏర్పాట్లు చేసినా కేడర్ డుమ్మా..!ధాన్యం కొనుగోళ్లుపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించింది అధికార టీఆర్ఎస్. ఇంఛార్జ్ మంత్రి…
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనా..? తాను ఎంపీపీగా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి…
కేంద్రంపై మరోసారి పోరుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్ పార్టీ.. టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష సమావేశం పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరుపై చర్చించనున్నారు. యాసంగి ధాన్యాన్ని వందశాతం కేంద్రం ప్రభుత్వం సేకరించేలా ఒత్తిడిచేసేందుకు చేపట్టాల్సిన రాజకీయ కార్యాచరణపై ఎమ్మెల్యేలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. అటు పార్లమెంట్‌లో కూడా ఏం చేయాలో ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. Read Also:…
సర్వేలలో కొందరు ఎమ్మెల్యేలు వెనకపడ్డారనే ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో కాక రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చేస్తారనే ఆలోచనలతో.. కొందరు పార్టీ నేతలు కర్చీఫ్‌లు వేసుకునే పనిలో పడ్డారు. కార్యక్రమాల స్పీడ్ పెంచి.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నానాపాట్లూ పడతున్నారట. పోటీకి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారట. ఐదు చోట్ల సిట్టింగ్‌లపై వ్యతిరేకత ఉందని ప్రచారంవచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార టీఆర్‌ఎస్ క్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఇంతలో…
ఖాళీ జాగా కనిపిస్తే హాంఫట్..! కబ్జాల యవ్వారం పార్టీ పెద్దల వరకు వెళ్లిందట. సమస్య శ్రుతిమించడంతో హైకమాండ్ క్లాస్ తీసుకుంది. ఆ విషయం తెలిసినప్పటి నుంచి అక్కడి టీఆర్ఎస్ రాజకీయం వేడెక్కిందట. ఆదిలాబాద్‌లో స్థానిక ప్రజాప్రతినిధుల కబ్జాలుఇటీవల నిర్మల్ మున్సిపల్ వైస్‌చైర్మన్ ఓ బాలికపై అత్యాచారం కేసులో అరెస్ట్ కావడం చర్చగా మారింది. అప్పటి నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ కౌన్సిలర్ల పనితీరుపై పార్టీ అధిష్ఠానం ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తోందట. ఆ క్రమంలోనే ఆదిలాబాద్…
అధికార టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రమంతా ఒకతీరు… ఖమ్మం జిల్లాలో ఒకతీరు మాదిరిగా వుంది. నేతలు వర్గాలుగా చీలిపోయి అస్థిత్వం కోసం పోరాటం చేస్తూ వుంటారు. తాజాగా పోటాపోటీగా చేసిన కార్ల ర్యాలీలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. ఖమ్మం జిల్లా వేంసూర్ మండలం కందుకూరు గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి వేరువేరుగా చేరుకుని విజేతలకు బహమతులను ప్రధానం చేశారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ…
BJP MLA Raja Singh Criticized TRS Leaders. కేంద్రం కోటాలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నిరుద్యోగులను నిండా ముంచుతున్నారనే ఆరోపణలతో టీఆర్ఎస్ మరో పచ్చి అబద్దానికి తెరలేపారన్నారు. గత ఏడేళ్లుగా ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా 700 మంది నిరుద్యోగుల చావుకు కారణమైన కేసీఆర్ ప్రభుత్వమని, ఇయ్యాల 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉండగా… 80 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తానని చెబుతూ అదేదో ఘన కార్యంగా చెప్పుకోవడం…
టీఆర్ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా? అంటే అవుననే అంటున్నారు. ఒకే ప్రాంతానికి చెందిన నేతలు కలిస్తే అది పెద్ద వార్త కాదు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన ముగ్గురు అసంతృప్తి నేతలు కలవడం రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన టీఆర్‌ఎస్ నేత జూపల్లి కృష్ణారావు ఉమ్మడి జిల్లాలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును, ఖమ్మం లో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలవడం వెనుక ఏం జరుగుతుందనేది చర్చకు దారితీస్తోంది. ఉమ్మడి మహబూబ్‌గర్…