బీజేపీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. బీజేపీ నేతలను మెంటల్ ఆసుపత్రులలో చేర్పిస్తారన్నారు హరీష్ రావు. ప్రొరోగ్ అంశం స్పీకర్ పరిధి లోనిది. బీజేపీ నేతలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడాలో తెలియక.. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గవర్నర్ మహిళ కదా అందుకే సభకు పిలవడం లేదంటుంది బీజేపీ. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం నీ అవమానించాయి. అస్సాం సీఎం వ్యాఖ్యలు సమర్ధించారు బండి సంజయ్. మమత…
తెలంగాణలో ఆడపిల్లలు, మైనర్ బాలికలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు ఆకుల విజయ. నిర్మల్ మునిసిపల్ వైస్ ఛైర్మెన్ నిర్మల్ నుండి మైనర్ బాలికను హైదరాబాద్ కి తీసుకువచ్చి అత్యాచారం చేశారు. తవరకు అతడిని అరెస్ట్ చేయలేదు. టి ఆర్ ఎస్ నాయకుడు కాబట్టే ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అలాగే, సిరిసిల్లలో ఒక అమ్మాయి మిస్ అయ్యి నెల రోజులు అయింది. కేటీఆర్ నియోజకవర్గంలో అమ్మాయి…
ఒక్క విగ్రహావిష్కరణ అధికారపక్షం నేతల మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన ఘర్షణ ఖమ్మం జిల్లాలో చినికి చినికి గాలి వానగా మారుతోంది. టీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాలు బాహా బాహికి గత రాత్రి దిగగా.. ఆ దాడుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ద్రోహం చేసిన వ్యక్తి రేగా అంటూ మాజీ ఎంఎల్ఎ పాయం ఆరోపిస్తుండగా పొంగులేటి పార్టీ బయటకు వెళ్లి పర్యటనలు చేయాలని రేగా కాంతారావు అంటున్నాడు.…
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. వైరా టీఆర్‌ఎస్‌లో గత మూడేళ్లుగా కనిపిస్తున్న సీన్. ఇప్పుడు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది ఆధిపత్యపోరు. సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుకలు నిర్వహించిన వారిపై కేసులు పెట్టడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్. మూడేళ్లుగా వైరాలో ఆధిపత్యపోరుఎన్నికల్లో గెలుపోటములు నేతల జాతకాలను మార్చేస్తాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లా వైరాలోనూ అదే జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే రాములు నాయక్. 2018లో ఆయన ఇండిపెండెంట్‌గా గెలిచారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ ఓడిపోయారు. అప్పటి వరకు వైరాలో…
టీఆర్‌ఎస్‌లో ఆ నేతల మౌనం వెనక మతలబు ఏంటి? రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను అంచనా వేసే పనిలో ఉన్నారా? సమయం.. సందర్భం చూసి అడుగులు వేస్తారా? ఎవరా నాయకులు? మూడేళ్లయినా లోకల్ ఎమ్మెల్యేతో గ్యాప్2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర సమితి.. రెండోసారి అధికారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పలువురు టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో విలీనం అయ్యారు. ఆ అంశంపై అధికార టీఆర్ఎస్ .. విపక్ష…
తెలంగాణ శాసన మండలిలో 12 మంది ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసింది. వీరిలో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఉండడంతో… కొత్త ప్రొటెం చైర్మన్ కు కసరత్తు పూర్తయింది. కొత్త ప్రొటెం చైర్మన్ గా రాజేశ్వర్ రావు నియామకం కానున్నారు. తెలంగాణ శాసన మండలిలో12 మంది ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసింది. ఇందులో కొద్ది మంది తిరిగి శాసన మండలికి ఎన్నికయ్యారు. మొత్తం 12 మంది శాసన మండలి సభ్యులు ఈ నెల 12 న ఎమ్మెల్సీలుగా…
ఆయనేమో మంత్రి.. ఇంకొకరు మాజీ మేయర్. రాజకీయంగా ఇద్దరి మధ్య పాత పగలు ఉన్నాయట. అవి కొత్తగా సెగలు పుట్టిస్తాయేమోనని డౌట్. అందుకే అందరి దృష్టీ ఆ ఇద్దరిపైనే ఉంది. ఎవరా నాయకులు? ఏంటా వివాదం? రవీందర్ సింగ్ రీఎంట్రీ.. వాడీవేడీ చర్చ..!కరీంనగర్ టీఆర్‌ఎస్ రాజకీయాల్లో సెగలు రాజుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందన్నది అధికారపార్టీ వర్గాల మాట. ఇందుకు మంత్రి గంగుల కమలాకర్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ మధ్య నెలకొన్న…
రోజులు,ఏళ్ళు గడిచిపోతున్నాయి కానీ.. నామినేటెడ్ పదవులపై చాలామంది టీఆర్‌ఎస్ నేతల ఆశలు తీరడంలేదు. ఈ ఏడాదిలోనైనా వారికల నెరవేరుతుందా? అధికారపార్టీ ఆలోచన ఏంటి? పదవులతో ఎంతమందిని సంతృప్తి పర్చగలదు? కొత్త ఏడాదిలో పదవులు వస్తాయనే ఆశల్లో నేతలు గంపెడాశలతో వున్నారు. 2018 డిసెంబర్‌లో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నామినేటెడ్ పదవులపై అనేకమంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికే నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి పదవీకాలం ముగియడంతో వాళ్లల్లో కొందరికి మరోఛాన్స్ ఇచ్చారు సీఎం…
వరస వివాదాలతో ఆ సీనియర్ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్‌కు చీకట్లు అలముకున్నాయా? పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యులకూ టికెట్ కష్టమేనా? గేర్ మార్చడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు? ఆందోళన చెందుతున్నదెవరు? లెట్స్ వాచ్..! వనమా కుటుంబానికి రాజకీయ చీకట్లు..!వనమా వెంకటేశ్వరరావు. నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 18 ఏళ్లపాటు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న వనమా.. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్ శాసనసభ్యుడు. వయసు పైబడుతున్న తరుణంలో రాజకీయంగా తన ఇద్దరు…
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు.. చనిపోయిన ఆరుగురిలో… నలుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు.. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌పై భద్రాద్రి కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు…