మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు.. ప్రజల మనుసుల్లో ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. నిన్న కొన్ని నాటకీయ పరిణామాలతో ఆయన అరెస్ట్ అయిన విషయం తెలిసిందే కాగా.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు టీఆర్ఎస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని మండిపడ్డ ఆయన.. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతికదాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు బందోబస్తు ఇవ్వమని అధికారులను కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Attack Review: ఎటాక్ (హిందీ)
టీఆర్ఎస్ కార్యకర్తలకు మేమున్నాం.. మీకేం కాదు అని ఏసీపీ చెబుతున్నారని ఆరోపించారు రఘునందన్‌రావు.. మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదు… ప్రజలమనుసుల్లో ఉన్నామన్న ఆయన.. ఎమ్మెల్యే ప్రాణం కాపాడేందుకు రాలేదు.. కానీ, శిలా ఫలకం కట్టించేందుకు యాభై మంది పోలీసులు అవసరమా? అని నిలదీశారు. ఒక్కరిని అరెస్టు చేసేందుకు పదుల సంఖ్యలో పోలీసులు ఎందుకు? అని ప్రశ్నించిన రఘునందన్.. భౌతికంగా నన్ను ఎలిమినేట్ చేయాలనుకుంటే నేను స్వాగతిస్తున్నా.. రఘనందన్‌రావు భయపడడని స్పష్టం చేశారు. మా మాటలు వినపడకూడదు అని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని దుయ్యబట్టిన ఆయన.. ఒక్క కేసు ఉన్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని.. నాపై దాడికి యత్నించిన.. శిలాఫలకం కూల్చివేసిన వారిపై కేసు పెట్టరు… నాపైనే కేసు పెట్టారని మండిపడ్డారు.