పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై విరుచుకుపడ్డారు పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే , బీజేపీ నేత టి.నందీశ్వర్ గౌడ్. బచ్చుగూడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. స్ధానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ప్రధాన మంత్రికి దొడ్డిదారిన వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించటం సాధ్యమేనా..? తాను ఎంపీపీగా, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులపై శ్వేత పత్రం ఇవ్వడానికి సిద్దం.
నీవు ఎంపీపీగా ఉన్నప్పుడు ఓ మహిళా అధికారిపై అసభ్యకరంగా ప్రవర్తించిన తీరు ప్రజలకు చరిత్ర తెలుసు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభద్రతా భావంతో ఏదో మాట్లాడుతున్నారు. జనం సానుభూతిని ఓట్లు ద్వారా పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,అతని సోదరుడు మధు సూదన్ చేసిన కబ్జాలను నిరూపించేందుకు ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను.
లక్డారంలో క్రషర్ అనుమతులు 10ఎకరాలకు ఉంటే అక్కడ శిఖంలో 45 ఎకరాలు కబ్జా పెట్టిన ఘనత ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిది. క్రషర్లు ద్వారా నెలకు 4లక్షల టన్నుల మైనింగ్ కుంభకోణం చేస్తున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా నెలకు 12కోట్లు సంపాదిస్తూ.. ఏడాదికి కోటి రూపాయలు కట్టాల్సిన ఎమ్మెల్యే నాలుగు లక్షలు మాత్రమే ట్యాక్స్ చెల్లించటం అన్యాయం, దోపిడీ కాదా అని ప్రశ్నించారు నందీశ్వర్ గౌడ్.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలను రుజువు చేయలేకపోతే నన్ను కొట్టి చంపండి, జైల్ లో పెట్టండని సవాలు విసిరారు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్. ఐలాపూర్ లో మహిపాల్ రెడ్డి తమ్ముడు 135/2,135/3లో 1ఎకరన్నరకు పైగా అసైన్డ్ భూమి కబ్జా చేసినట్లు రుజువు నా దగ్గర ఉంది. మరి మహిపాల్ రెడ్డి నీవు ఇప్పుడు ఏకే 47తో కాల్చుకుంటావా..? సర్వే నెంబర్ 119 అమీన్ పూర్ లో 131ఎకరాల భూమి. కో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లో మధుసూదన్ రెడ్డి , అక్రమంగా దొంగ లేఅవుట్ చేసారు. విద్యుత్ సౌధలో ఫేక్ లేఅవుట్ చేసిన మధు సూదన్ రెడ్డి పెద్ద ఎత్తున భూ విక్రయాలు చేశారు.
బీజేపి నేత శ్రీనివాస్ గుప్తాకు చెందిన భూమి సర్వే నెంబర్ 976లో చనిపోయిన వ్యక్తి పేరుతో ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి ఫేక్ ఆధార్ కార్డు, డాక్యుమెంట్లు సృష్టించి దాదాపు 74 ప్లాట్లను కబ్జా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. పెద్దకంజర్లలో 2007 నుంచి 2014లో 5 ఎకరాల భూమి పోరంబోకుగా ఉండేది. మధు సూదన్ రెడ్డి చొరవతో ఆ భూమిని పట్టా భూమిగా ఎలా మారిందన్నారు నందీశ్వర్ గౌడ్.
ఎన్నో పాపాలు, కబ్జాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వదు కాబట్టే కార్యకర్తను నిలబెడతానంటున్నవ్. అమీన్ పూర్ పెద్ద చెరువు ను కబ్జా చేసి బహుళ అంతస్తుల భవనాలను, నిర్మిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు. భూ కుంభకోణాలు, అవినీతి సొమ్మును 40శాతం ఎమ్మెల్యే, 40 శాతం బిల్డర్లు 20శాతం అధికారులు వాటాలు పంచుకుంటున్నారు. జీయంఆర్ కన్వెన్షన్ హాల్ కూడా కబ్జానే.. రోడ్లు మూసేసి మ్యారేజ్ హాల్ నిర్మాణం చేశారు.
పటాన్ చెరులో వక్భ్ బోర్డు ల్యాండ్ లో బొందల గడ్డపై ఆసుపత్రి నిర్మిస్తున్నారు. 700కోట్ల రూపాయల విలువైన ఎన్ ఓ సీ లను మంత్రి హరీశ్ రావు చొరవతో ఇచ్చారు. పాశమైలారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు 2 ఎకరాలు కబ్జా చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. పోచారంలో 9ఎకరాల భూమిలో డబుల్ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతూ మధుసూదన్ రెడ్డి భూ విక్రయాలు చేస్తున్నారు. ప్రాణం ఉన్నంత వరకు ఈ కుంభకోణాలపై పోరాటం తప్పదన్నారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పై ఉన్న కేసును కొట్టివేసేందుకు మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తికి ఆరు ఎకరాలు. నజరానా ఇచ్చినవ్,కోర్టులో పనిచేసే వ్యక్తికి కోటి రూపాయలు ఇచ్చావ్. ఇంటి పక్కనే రామమందిరం ఆలయాన్ని కబ్జా చేశావ్. ఖాళీ జాగాలు కనిపిస్తే లారీలను పార్కింగ్ చేసి కబ్జాలకు పాల్పడే చరిత్ర మీది.
తెలంగాణ రాష్ట్రంలో కాపాలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ దోచుకునే కుక్కలా మారాడు….దోచుకున్న డబ్బు మళ్లీ ఎన్నికలలో ఖర్చు చేసేందుకు 50 కోట్లు ఇస్తామనటం. ఎంతవరకు సమంజసం? ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి భూకబ్జాలపై చాలా సీరియస్ గా ఉన్నాం. భూ కబ్జాలకు పాల్పడిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,ఆయన తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి పై ధర్మ పోరాటానికి ఎంతటి ఉద్యమాలకైనా సిద్దంగా ఉన్నాం అన్నారు నందీశ్వర్ గౌడ్.