సంగారెడ్డి జిల్లాలో అందోల్, జహీరాబాద్ రెండు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాలున్నాయి. అందోల్ నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ తలపడుతున్నారు. గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర... ప్రస్తుతం రేవంత్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు.
టీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి బెదిరింపులకు దిగుతున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. చెప్పుతో కొడతా అని ఒక నికృష్ట మంత్రిని మాత్రమే అన్నానని ఆమె పేర్కొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఘటనను పూర్తిగా గవర్నర్ కు వివరించానని తెలిపారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థులను యాత్రల పేరుతో రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. మంత్రి సత్యవతి రాథోడ్. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన పని లేదని, చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. చిన్న విషయాల కోసం పోయి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని సూచించారు. డిమాండ్లను తీర్చేందుకు పని చేస్తున్నామని అన్నారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ట్రిపుల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి చనిపోవడం భాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.…