తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పటివో అయినా.. ఈ మధ్య తరచూ విమర్శలు, ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ… మీకు నిజాయితీ ఉంటే అక్రమంగా చేపట్టిన ఆర్డీఎస్ పనులను ఆపాలని డిమాండ్ చేశారు.. ఆర్డీఎస్ పై అవగాహన లేని బచ్చాగాళ్లు ముఖ్యమంత్రి రాసిచ్చిన కాగితాలు చూసి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయిన ఆమె.. ఆంధ్రవాళ్లు అని విమర్శించే వారు రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది…
హుజురాబాద్‌పై వరంగల్ జిల్లా టీఆర్‌ఎస్ నేతలు ఫోకస్ పెట్టారా? ఆ నియోజకవర్గంలో వరస పర్యటనలు చేస్తున్నారా? ఉపఎన్నికలో ఓరుగల్లు అధికారాపార్టీ నాయకులే కీలకం కాబోతున్నారా? క్షేత్రస్థాయిలో అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్! హుజురాబాద్‌లో మోహరించిన ఓరుగల్లు టీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో త్వరలో ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గం హుజురాబాద్. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఇక్కడ ఉపఎన్నిక రాబోతుంది. ఈ నియోజకవర్గం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నా.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఆనుకుని ఉంటుంది. అందుకే…
వారిద్దరూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు. ఒకరు ఎమ్మెల్యే.. మరొకరు ఎమ్మెల్సీ. కలిసి సాగాల్సిన చోట కత్తులు దూసుకుంటున్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఎత్తులు వేస్తున్నారు. పోలీసుల ఎంట్రీ వారి మధ్య ఇంకా గ్యాప్ తెచ్చిందట. ఎవరా నాయకులు? ఏమా కథ? వేడెక్కిస్తున్న నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ రాజకీయం నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నా.. సందర్భం వస్తే ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇదే…
కన్నతల్లి లాంటి తెరాస పార్టీని వీడేదిలేదని కమలాపూర్ మండలం జెడ్పిటిసి లాండిగ కళ్యాణి లక్ష్మణ్ రావు,మాజీ జెడ్పిటిసి మారపెళ్లి నవీన్ కుమార్,మండల పార్టీ అధ్యక్షులు మాట్ల రమేష్ తేల్చిచెప్పారు. ఈ రోజు ఉదయం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారిని హన్మకొండలోని వారి నివాసంలో కలిసి కేసీఆర్ గారి నాయకత్వంలో, పార్టీ సూచనల మేరకు పనిచేస్తామని కమలాపూర్ మండలంలో తెరాసను ఎదురులేని శక్తిగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నాగుర్ల వెంకన్న, వరంగల్ అర్బన్…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో తెరాస పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శీను కన్సిలర్ లతో ఈటల పై ప్రెస్ మీట్ పెట్టారు. గత రెండేళ్ల నుండి పార్టీకి అతీతంగా మాట్లాడుతున్న ఈటల మాటలతో పార్టీకి దూరమైనవు అని అన్నారు. ప్రగతి భవనంలో కేసీఆర్ సమయం ఇవ్వకపోతే ఆత్మగౌరవం అడ్డొచ్చిందా అని అడిగిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో పనులమీద ఉంటాడు. మిమ్ములను స్వంత కుటుంబ సభ్యునిగా,తమ్మునిగా చూసుకున్న కెసిఆర్ మీకు ఏమి తక్కువ చేశారని…
తెరాస నాయకుల కు డబ్బులు అవసరం ఉంటే రోడ్లలను కూల్చి మళ్ళీ కట్టి డబ్బులు దండుకుంటున్నారు అని బండి సంజయ్ అన్నారు. కేంద్రం ఆర్థిక సంఘం నిధులు 30 కోట్ల40 లక్షల రూపాయల ఇచ్చింది. సిద్దిపేట లో 2799 ఇళ్లకు 137 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. సిద్దిపేట లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తులు వచ్చాయి, ఎంత మందికి ఇళ్ళు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేసి, సిద్దిపేట ను అభివృద్ధి…
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగడంతో అధికారపార్టీ టీఆర్‌ఎస్‌లో సందడి మొదలైంది. ఎమ్మెల్యేలకు తలనొప్పులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఒక్కో డివిజన్ నుంచి వందల మంది పోటీకి సిద్ధపడుతుండటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ దశలో టికెట్ రానివారి రియాక్షన్ ఎలా ఉంటుందోనని తలుచుకుని ఆందోళన చెందుతున్నారట. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు! గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలే అయినా.. పరిధి మాత్రం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉంది.…