కరోనాను ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు : విజయశాంతి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సర్కార్ పై బిజేపి నేత విజయశాంతి ఫైర్ అయ్యారు. కేంద్రం కరోనా డోసులు ఇచ్చినప్పటికీ ప్రజలకు ఇవ్వడం లేదని ఆమె ఫైర్ అయ్యారు. “కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు… రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు. రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుకుగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదు. రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచీ వాక్సినేషన్ ఆపేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు…. ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదు. కరోనా కట్టడిపై తెలంగాణ సర్కారు తీరిది. మరోవైపు మల్లాపూర్‌కు చెందిన ఒక గర్భిణిని చేర్చుకోవడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోంది. ఎందరో బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణం దృష్టి సారించాలి. ఇంకోపక్క తెలంగాణ రైతు మరోసారి కడగండ్ల పాలు కావడం బాధ కలిగిస్తోంది. వడ్ల కొనుగోళ్ళలో తెలంగాణ సర్కారు ఉదాసీనతతో ధాన్యం వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారు. తెలంగాణ సర్కారు ఎటు చూసినా వైఫల్యాలే తప్ప… పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ఒక ప్రణాళిక కనిపించడం లేదు.” అంటూ విజయశాంతి మండిపడ్డారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!