మొత్తం అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరిస్తారా : విజయశాంతి ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెసిఆర్ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్ అయ్యారు. “తెలంగాణలో కీలక వ్యవస్థలు ఎంత దారుణంగా కుప్పకూలాయో అర్థం కావాలంటే నేటి పత్రికల్లో వచ్చిన కథనాల్ని గమనిస్తే చాలు. రాష్ట్రంలో భూములమ్మి ఎలాగేనా వేల కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుకోవడం లక్ష్యంగా ఆగమేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ గారు… నేడు భావితరాల ప్రయోజనాల కోసం రాష్ట్రంలో సర్కారు భూమి అన్నదే లేకుండా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. అత్యంత కీలకమైన భూములను పెద్ద మొత్తంలో అమ్మేసి, రాష్ట్రాన్ని ప్రయివేటీకరించడమే తెలంగాణ సర్కారు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ భూముల అమ్మకాలపై మంత్రి హరీష్‌రావు గారు ఈ మధ్య స్పందిస్తూ… గత ప్రభుత్వాలు భూములమ్మగా లేంది… మేం చేస్తే తప్పా? అని అడిగారు. ఆ సర్కార్లు చేసిన తప్పును ఆనాడు అన్ని వర్గాలూ ఎండగట్టాయి. అదే తప్పు మీరు చేస్తే, అది రైటెలా అవుతుంది?… ఈ అవకతవక రెవెన్యూ విధానాలతో పాటు తెలంగాణలో కుప్పకూలుతున్న మరొక వ్యవస్థ ఉన్నత విద్యా రంగం. మొన్నటి వరకూ రాష్ట్రంలోని వర్సిటీలకు వీసీలు లేక వ్యవస్థ గాడి తప్పింది. ఈ విషయమై రాష్ట్ర సర్కారుకు స్వయంగా గవర్నరే ఘాటుగా లేఖ రాసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెరపైకి వచ్చిన మరో అంశం ఈ వర్శిటీలను తీవ్రంగా వేధిస్తున్న ప్రొఫెసర్ల కొరత. దాదాపు 3 వంతుల పోస్టులు (2,152) ఖాళీగా ఉన్నాయంటే విద్యా వ్యవస్థను ఈ సర్కారు ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. సుమారు 1000 పైచిలుకు ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నాలుగేళ్ళ కిందటే నిర్ణయం తీసుకుని కూడా భర్తీ చెయ్యలేదు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తున్న ఈ తెలంగాణ సర్కారు కుప్పకూలితే గాని మంచి రోజులు రావు.” అని విజయశాంతి పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..