టీఆర్ఎస్ సర్కార్ పై బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాళన ప్రారంభమైందని.. ప్రజలు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. టీఆరెస్ పార్టీ ఒక గడిలా పార్టీ అని.. నిజాంను మైమరిపించే విధంగా ఒక రాక్షస నిరంకుశ పాలన కోనసాగిస్తున్నదని ఫైర్ అయ్యారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న ఈటెలకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఈ విధంగా జరిగిందంటే మిగతా వాళ్లు కూడా ఆలోచించు కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రేపు ఎవరికైనా జరిగేది ఇదే మేం గతంలో చెప్పారు ఇప్పుడు కూడా చెబుతున్నామన్నారు. ఇవాళ ఉద్యమకారులకు రక్షణ కల్పించే పార్టీ బిజేపి అని.. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఎదురుకునే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బిజేపి అని తెలిపారు.
ఉద్యమకారులకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఒక వేదిక కాబోతోందన్నారు. ముఖ్యమంత్రికి అనుకూలంగా ఉన్న వారిని దగ్గర ఉంచుకున్నాడని.. టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యేలు, మంత్రుల చిట్టా అంతా తీస్తున్నామని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా ఆరోపించే పార్టీ బిజెపి కాదని..తేనె తుట్టెను ముఖ్యమంత్రి కెసిఆర్ కుదిపించాడని.. టిఆర్ఎస్ పార్టీ పతనం ప్రారంభం అయిందని హెచ్చరించారు. డబ్బులు, అడ్డదారులలో గెలవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడని మండిపడ్డారు.