ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా.. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది.
Mumbai Indians IPL 2025: ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ రాబోయే సీజన్‌కు ముందు తన జట్టును మరింత బలోపేతం చేసే క్రమంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌ను నియమించింది. ఈ బాధ్యతను ఇంగ్లండ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కార్ల్ హాప్కిన్సన్‌కు అప్పగించింది. 43 ఏళ్ల హాప్కిన్సన్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు గత 7 సంవత్సరాలుగా ఫీల్డింగ్ కోచ్ గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్ సాధించిన రెండు ప్రపంచ కప్ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. Also Read:…
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం జెడ్డా వేదికగా ఆటగాళ్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్ బౌలర్ రాహుల్ చాహర్, ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ లో ఒకరైన జంపాను సన్ రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. అలాగే ఇప్పటి వరకు 2025 వేలంలో ఏ ఆటగాడు ఏ టీం ఎవరిని కొనుగోలు చేసిందో ఒకసారి చూద్దాం. * పంజాబ్ కింగ్స్ తమ జట్టులో మార్కస్ స్టోయినీస్‌ను చేర్చుకుంది. పంజాబ్…
Trent Boult React on IND vs NZ World Cup 2023 Semifinal Match: వన్డే ప్రపంచకప్ 2023 సెమీఫైనల్‌లో భారత్‌తో అంత ఈజీ కాదని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు. అభిమానుల మద్దతుతో సొంతగడ్డపై సెమీస్ మ్యాచ్ ఆడబోతున్న టీమిండియాను ఎదుర్కోవడం పెద్ద సవాల్ అని, తిరుగులేని ఫామ్‌లో ఉన్న జట్టును ఆపడం అంత తేలికేం కాదన్నాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. దాదాపుగా సెమీస్…
2023 వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్టార్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చారిత్రాత్మక వికెట్ తీశాడు. తొలి ఓవర్ తొలి బంతికే బంగ్లాదేశ్ ఓపెనర్ లిటన్ దాస్ క్యాచ్ పట్టాడు. ఈ వికెట్‌తో ట్రెంట్ బౌల్ట్ వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన తొలి న్యూజిలాండ్ బౌలర్‌గా నిలిచాడు.
రాజస్థాన్ రాయల్స్ రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాజస్థాన్ అదరగొట్టింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు.
టీ 20 ప్రపంచ కప్ 2021 ఫైనల్ లో న్యూజిలాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. గత ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో పరాజయం పాలైనప్పటికీ.. కివీస్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకుంది. తాజాగా ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేసిన పని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ 20 ప్రపంచ కప్ ముగించుకొని టీమిండియా పర్యటనకు దుబాయ్ నుంచి భారత్ కు బయలుదేరిన న్యూజిలాండ్ జట్టు ఎయిర్‌పోర్ట్ వరకు బస్ లో వచ్చింది.…
ఈరోజు నుండి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు జట్లు టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటే… ఈ సిరీస్ లో పాల్గొంటున్న ఆ జట్టులో కీలకమైన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2021…