ఈరోజు నుండి ఇండియా – న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్ ముగిసిన తర్వాత రెండు జట్లు టెస్ట్ సిరీస్ లో పాల్గొంటాయి. ఈ టెస్ట్ సిరీస్ కోసం సిద్ధం కావడానికి కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటే… ఈ సిరీస్ లో పాల్గొంటున్న ఆ జట్టులో కీలకమైన బౌలర్ ట్రెంట్ బౌల్ట్ టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఐపీఎల్ 2021 రెండవ భాగంలో ఆడటానికి వచ్చిన బౌల్ట్… బయో బబుల్ లో చేరి ఆ తర్వాత అందులోనే ఉంటూ టీ20 ప్రపంచ కప్ కూడా ఆడాడు. దాంతో 12 వారాల నాన్ స్టాప్ క్రికెట్ తర్వాత తనను తాను రిఫ్రెష్ చేసుకోవాలనుకుంటున్నానని… అందుకే ఈ టెస్ట్ సీరిస్ నుండి తప్పుకుంటున్నట్లు బౌల్ట్ ప్రకటించాడు.