ఏపీలో రాజకీయ పరిణామాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరగడం. దీంతో టీడీపీ అధినేత దీక్షలు చేపట్టడం.. అనంతరం పట్టాభి అరెస్ట్, అసెంబ్లీ సమావేశాల ఘటన ఇలా ఒక్కో ఘటనకు ఏపీ రాజకీయాలు అతిథ్యమిచ్చాయి. ఇప్పుడు తాజాగా మరోసారి టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల నారా భువనేశ్వరి వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరుఫున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి…
గత అసెంబ్లీ, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీ నాయకులు హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చుతామంటూ ప్రకటనలు చేశారు. యూపీ సీఎం యోగి కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చి ఈ విషయాన్ని ఉద్ఘాటించారు. దీంతో ఈ విషయంపై నిరసన జ్వాలలు కూడా రగిలాయి. అయితే తాజాగా భాగ్యనగర్ పేరుతో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ట్వీట్ చేయడంతో మరోసారి ట్విట్టర్ వేదికగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో హైదరాబాద్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్…
భారత రక్షణ మంత్రిత్వ శాఖ నియంత్రణలో పరిపాలన సాగిస్తున్న కంటోన్మెంట్ బోర్డు సికింద్రాబాద్‌లో కూడా ఉన్న విషయం మనకు తెలిసింది. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లోని ప్రజలను పలకరిస్తే కంటోన్మెంట్ ప్రాంతం కాశ్మీర్‌లా మారిందంటూ పలువురు సమాధానం చెప్పడం గమనార్హం. వారి మాటలను క్షుణ్ణంగా పరిశీలిస్తే.. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తిరుమలగిరి, మారేడ్‌పల్లి, అమ్ముగూడ, హకీంపేట, జవహర్ నగర్, కార్ఖాన, బోయిన్‌పల్లి, కౌకూర్, బొల్లారం ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని ప్రజలు ఆర్మీ అధికారులు విధించే…
కరోనా రక్కసి మహారాష్ట్రను వదలనంటోంది. డెల్టా వేరియంట్‌తో ఇప్పటికే మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సైతం మహారాష్ట్రలో విజృంభిస్తోంది. అయితే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సిబ్బందితో పాటు అక్కడ విధులు నిర్వహించే పోలీసులకు కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. దీంతో 8 మంది పోలీసులతో సహా మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మరింత…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు 11వ పీఆర్సీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసి పీఆర్సీపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయితే సీఎస్ సమీర్ శర్మ కమిటీ 14.29 ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ నివేదకను సమర్పించారు. అయితే ఈ నివేదిక ప్రభుత్వ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగ సంఘాల నేతలు నిరసనలు చేపడుతూనే ఉన్నారు. అయితే పీఆర్సీసై చర్చించేందుకు ప్రభుత్వ సలహాదారు…
గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ వేరియంట్ పలు దేశాలకు వ్యాపించగా అక్కడ పలు ఆంక్షలు విధించారు. కొన్ని దేశాల్లో విమాన రాకపోకలపై నిబంధనలు పాటిస్తున్నారు. అయితే రోజురోజుకు ఒమిక్రాన్ విజృంభన పెరిగిపోతుండడంతో తాజాగా యూకేలో ఒక్కరోజే 15,363 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య లక్ష దాటడంతో ప్రపంచ దేశాలు మరోసారి భయాందోళన చెందుతున్నాయి. యూకేలో ఇప్పటి వరకు…
మనకు మామూలుగా పెయింటింగ్ అంటే ముందుగా గుర్తుకువచ్చేది పికాసో. ఎందుకంటే పెయింటింగ్స్‌లో ఆయన అంత ప్రావీణ్యం కలవాడు కాబట్టి. అయితే పందుల్లో కూడా పెయింటింగ్స్‌లో ప్రావీణ్యం కలిగిన ఓ పంది ఉంది. దానిపేరే పిగ్‌కాసో. సౌతాఫ్రికాలో ఉంటున్న ఈ పందిని చిన్నప్పుడే తన యజమాని ఓ మటన్ షాపుకు అమ్మేశాడు. అయితే ఆ మటన్‌షాపు యజమాని దీనిని వధించి వంటకు వాడాలనుకున్నాడు. కానీ.. అంతలోనే సౌతాఫ్రికాలోని పశ్చిమ కేఫ్ ప్రాంతానికి చెందిన జువానే లెఫ్‌సన్ అనే మహిళ…
ఇటీవల కాలంలో ఖమ్మం వ్యక్తులు వార్తల్లో నిలుస్తున్నారు. అయితే వాళ్లు తమ టాలెంట్‌తో వార్తల్లో నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. మన్ననలే కాదు పాపులర్ కూడా అయిపోయారు. జెమినీ టీవీలో ప్రసారమైన ఎవరు మీలో కోటీశ్వరులు, మా టీవీలో ప్రసారమైన బిగ్‌బాస్-5 షోలు ఎంతగా ప్రేక్షకాదరణ పొందాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఖమ్మం జిల్లాకు చెందిన రవీందర్ అనే వ్యక్తి ఏకంగా రూ.కోటి…
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో…
జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా…