అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్‌లు బయట పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టినా మరికొన్ని దేశాల్లోనైతే డెల్టా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా ఎఫెక్ట్‌తో పలు దేశాలు…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెల చివర్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు 18వ రోజుల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సభ ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లిఖింపూర్ ఘటనతో సహా వివిధ అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు ఇచ్చిన వివిధ నోటీసులు చైర్మన్‌కు ఇవ్వడంతో వాటిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. విపక్ష…
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు…
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసినందుకు ఒక వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. ఆ వ్యక్తి సాయంత్రం కరాచీలోని రాంచోర్ లైన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి హిందూ దేవత జోగ్ మాయ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. అయితే అనంతరం నిందితుడిని ప్రజలు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక మీడియా సమాచారం మేరకు నిందితుడిపై దైవదూషణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు…
అగ్రరాజ్యమైన అమెరికా పాలన కార్యాలయం వైట్ హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. గత నెలలో కూడా శ్వేత సౌధంలో కరోనా కేసులు బయటకు రావడంతో వైద్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు పరీక్షలు నిర్వహించారు. కొంతమందిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే తాజాగా మరో కరోనా కేసు వైట్ హౌస్‌లో వెలుగు చూసింది. గత మూడు రోజుల క్రితం జోబైడెన్‌తో ప్రయాణించిన తన పాలన యంత్రాంగంలోని ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే కరోనా సోకిన ఉద్యోగి…
కరోనా రక్కసి కొత్తకొత్తగా రూపాంతరాలు చెందిన ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ సమయంలో పలు దేశాల్లో వ్యాప్తి చెందిన దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే తాజాగా డబుల్ మాస్క్ తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎన్95 మాస్క్‌ను…
వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా నియోజకవర్గంలో పరిస్థితి టెన్షన్ టెన్షన్‌గా మారింది. నేడు సీఎం జగన్ జన్మదినం సందర్భంగా రోజా, రోజా వ్యతిరేక వర్గం పోటాపోటీగా జగన్ పుట్టినరోజు వేడుకలు చేయడానికి సిద్దమయ్యారు. నగరిలో రోజా పదివేలమందితో భారీ ర్యాలీ సిద్దం కాగా, రోజా వ్యతిరేక వర్గం పదివేలమందితో ర్యాలీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఎవరి వైపు వెళ్ళాలో అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు. నిన్న ఫ్లెక్స్ చింపివేయడంతో రెండు వర్గాల్లో…
రాష్ట్రంలో రోజురోజుకూ మరింత చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా కనిష్టస్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతు పడిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరో 3 రోజుల పాటు తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుమురం భీం జిల్లా గిన్నెధరిలో అత్యల్పంగా 3.5 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు…
మొన్నటి వరకు కరోనా డెల్లా వేరియంట్‌తోనే కొట్టుమిట్టాడిన ప్రపంచ దేశాలు ఇప్పుడు గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్‌తో భయాందోళన గురవుతున్నాయి. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల భారత్‌లోకి కూడా ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్యం 173కు చేరుకుంది. ఢిల్లీలో 6, గుజరాత్ 1, కేరళలో 4 చొప్పున గడిచిన…
ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనా డెల్టా వేరియంట్‌తో సతమతమవుతున్న వేళ దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మరోసారి యావత్తు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే తాజాగా ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ పలు విషయాలు వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకుని కోవిడ్ బారినపడి కోలుకున్న వ్యక్తులైన వారికి సైతం ఈ ఒమిక్రాన్…