జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం నేడు ప్రారంభం కానుంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. అంతేకాకుండా తణుకులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సభలోనే లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందించనున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. నేడు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కార్యక్రమానికి ఆయన మహిళ ఉద్యోగులతో కలిసి పాల్గొననున్నారు. ఢాకాలో నేడు హాకీ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్ జరుగనుంది. సెమీస్‌లో జపాన్‌తో భారత్ తలపడనుంది. బీజేపీ పార్లమెంటరీ…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల్లో టీఆర్‌ఎస్ నేతలు పెద్ద ఎత్తున్న ర్యాలీ నిర్వహిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఆయా ఎమ్మెల్యేలు పాల్గొనాలని కేసీఆర్ సూచించడంతో గజ్వేల్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆందోళ చేస్తే కార్లు ఎక్కించి చంపిన చరిత్ర బీజేపీది అని…
మెల్‌బోర్న్‌లో 2018లో జరిగిన ప్రపంచకప్‌లో కాంస్య పతకం సాధించిన తొలి భారతీయ జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించింది 25 ఏళ్ల హైదరాబాద్ జిమ్నాస్ట్, చెందిన బుద్ధార్ అరుణారెడ్డి. అయితే తాజాగా సోమవారం ఈజిప్ట్‌లోని కైరాలో జరిగిన హరోస్ కప్ అంతర్జాతీయ కళాత్మక టోర్నమెంట్‌లో హైదరాబాద్ జిమ్నాస్ట్ బుద్ధార్ అరుణారెడ్డి రెండు పతకాలను కైవసం చేసుకొని మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఫ్లోర్, వాల్ట్ ఈవెంట్‌లో అత్యున్నత గౌరవాన్ని సాధించి అరుణరెడ్డి రెండు స్వర్ణపతకాలను సాధించింది. గత సంవత్సరం…
గత నెల దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఇప్పటికే పలు దేశాలకు ఈ వేరియంట్ వ్యాప్తి చెందింది. అయితే ఇటీవల భారత్‌లోకి కూడా ఒమిక్రాన్ వేరియంట్ ప్రవేశించింది. భారత్‌లోని పలు రాష్ట్రాలకు వ్యాప్తి చెందిన ఒమిక్రాన్ వేరియంట్ దాని ప్రభావాన్ని చూపుతోంది. 20 రోజుల వ్యవధిలోనే దాదాపు 100కు పైగా ఒమిక్రాన్ కేసులు దేశ వ్యాప్తంగా నమోదయ్యాయి.…
ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రత్యకప్రసారం కోసం కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి.
క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్‌ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు అనుమతించరు. ఆ…
కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా దేశంపై తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు రాగా, 132 మంది మరణించారు. అయితే నిన్న ఒక్క రోజు 8,077 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే…
ఇటీవల ఇంటర్ ఫస్టియర్ ఫలితాలను ఇంటర్ బోర్డ్ అధికారులు విడుదల చేశారు. అయితే ఈ ఫలితాలలో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. టాప్ ర్యాంక్ విద్యార్థులు కూడా పాస్ కాకపోవడం గమనార్హం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ పలువురు విద్యార్థులు ఫెయిల్ అయ్యామనే మనస్థాపంతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు, విద్యాశాఖ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై…
తెలుగు రాష్ట్రాలపై చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. పలు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు అత్యల్పంగా నమోదవుతున్నాయి. దీంతో ఉదయం పూట పొంగమందు కురియడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాల కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత 10 సంవత్సరాల్లో ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా తెలంగాణలోని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో రికార్డ్ స్థాయికి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమురం భీం…
ప్రపంచ దేశాలు గత 2 సంవత్సరాలుగా కరోనా మహామ్మారితో పోరాడుతూనే ఉన్నాయి. కరోనా రక్కసి కొత్తకొత్త రూపాలు ఎత్తి ప్రజలపై విరుచుకుపడుతోంది. మొన్నటి వరకు అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు సైతం డెల్టా వేరియంట్‌ను తట్టుకోలేక విలవిలలాడిపోయాయి. అయితే ఇప్పుడు గత నెలలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతోంది. అంతేకాకండా ఆయా దేశాల ప్రజలపై దాని ప్రభావాన్ని చూపుడంతో భారీగా ఒమిక్రాన్ వేరియంట్…