ఇప్పటికే డెల్టా వేరియంట్ సతమతమవుతున్న భారత్‌కు ఒమిక్రాన్ టెన్షన్ మొదలైంది. ఇటీవల భారత్‌లోకి ప్రవేశించిన ఈ వేరియంట్ క్రమక్రమంగా రాష్ట్రాలను ఆక్రమిస్తోంది. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా 89 ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 361కు చేరింది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలు మరోసారి కఠినతరం చేస్తున్నారు. ఢిల్లీలో క్రిస్మస్, న్యూయర్ వేడుకలపై నిషేధం విధించారు. అలాగే ముంబైలో రాత్రిపూట 144 సెక్షన్‌ను…
న్యాచురల్ స్టార్ నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నాని శ్యామ్‌సింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో భగ్గుమన్నాయి. తాజాగా నాని వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సామాన్యుడికి సినిమా అందుబాటులో ఉండాలనే టికెట్ ధరలు తగ్గించామని బొత్స అన్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే జిల్లా అధికారులను ఆశ్రయించాలని, మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. మార్కెట్‌లో ఏదైనా…
రైతన్న దేశానికి వెన్నుముక అన్న మాట చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటాం కూడా. అయితే దేశానికి వెన్నుముకలాంటి రైతన్న వెన్నులో వణుకుపుట్టించే విధంగా రాజకీయ పార్టీలు వాటి లబ్దికోసం రాక్షస క్రీడ ఆడుతున్నాయి. రాజకీయ పార్టీలు ఆడే రాజకీయ రాక్షస క్రీడలో రైతన్నను పావుగా మారుతున్నాడు. మా ప్రభుత్వంలో రైతులకు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతాం.. నకిలీ విత్తనాలు, ఎరువులును ఆరికడతాం.. పంటకు మద్దతు ధర ఇస్తామంటూ…
వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఇంటికి ఒకటే మీటర్ ఉండాలంటూ విద్యుత్ పంపిణీ సంస్థలు నోటీసులివ్వడం దుర్మార్గమని ఆయన అన్నారు. దశాబ్దాల కాలం నుంచి ఒక ఇంటిలోని పోర్షన్ల ఆధారంగా విద్యుత్ సంస్థలు మీటర్లు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు ఒకే ఇంట్లో ఎన్ని పోర్షన్లు ఉన్నప్పటికీ ఓకే మీటర్ ఉంచి, మిగతావి రద్దు చేసుకోవాలని ఎలక్ట్రిసిటీ అధికారులు నోటీసులు ఇస్తున్నారని ఆయన అన్నారు. ఫలితంగా మీటర్…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న తరునంలో గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ భయంతో మరోసారి దేశవ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగూ వస్తోంది. తాజా దేశవ్యాప్తంగా 7,495 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 6,960 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 78,291 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న…
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు సర్వీసును రెన్యువల్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 31 మే 2022 వరకు 1,217 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్…
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ముందడుగు వేసింది. రైలు చక్రాలు తయారీలో విశాఖ స్టీల్స్ తొలి విడుతగా 51 లోకో వీల్స్ తయారీ చేసింది. లోకో వీల్స్ తయారీ కోసం రూ. 1700 కోట్లతో లాల్ గంజ్, రాయబరేలీలో ప్రత్యేక యూనిట్‌ని నెలకొల్పింది. లాల్ గంజ్ నుంచి తొలిసారిగా నిన్న రాత్రి 51 లోకో వీల్స్‌ని ఇండియన్ రైల్వే కి వైజాగ్ స్టీల్స్ ఉన్నతాధికారులు పంపించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించిన విషయం…
ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్ నుంచి బయటపడుతున్న భారత్‌ను ఒమిక్రాన్ టెన్షన్ పట్టిపీడిస్తోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని రోజురోజుకు పెంచుకుంటూ పోతోంది. దేశంలో 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాపించింది. తాజాగా దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 39 నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 263కు చేరుకుంది. తెలంగాణలో కొత్తగా 14, గుజరాత్ 9, కేరళలో 9, రాజస్థాన్‌లో 4, హర్యానా,…
కేంద్ర మంత్రులను కలిసేందుకు తెలంగాణ మంత్రులు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని తెలంగాణ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలేదని మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ మంత్రులు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ స్పందించారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకి తీవ్రం అవుతుందని, తెలంగాణ వస్తే ఆంధ్ర ఉద్యోగులు అందరూ వెళ్ళిపోతారు… మన వాళ్లకు ఉద్యోగాలు వస్తాయని కేసీఆర్ చెప్పారని ఆయన అన్నారు. అందుకే…
తండ్రీకూతుళ్ల మధ్య గాఢమైన ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. అందుకే కూతురు పెరుగుతున్న ప్రతి దశలో తండ్రి తన కోసం ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. ఒక్కోసారి చిన్నతనంలో ప్రతి ఆటలో గెలిచే సూపర్‌మ్యాన్ పాత్రలో, ఒక్కోసారి కూతురికి వీడ్కోలు పలికే సమయంలో చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఇంటి నుంచి వెళ్లిపోతున్న కూతురు, తండ్రి కళ్లలో తనపై అత్యంత నమ్మకం, ఆశను చూస్తుంది. అయితే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శివపురిలో టీ స్టాల్…