తండ్రీకూతుళ్ల మధ్య గాఢమైన ప్రేమ, ఆప్యాయత ఉంటుంది. అందుకే కూతురు పెరుగుతున్న ప్రతి దశలో తండ్రి తన కోసం ప్రత్యేక పాత్ర పోషిస్తాడు. ఒక్కోసారి చిన్నతనంలో ప్రతి ఆటలో గెలిచే సూపర్‌మ్యాన్ పాత్రలో, ఒక్కోసారి కూతురికి వీడ్కోలు పలికే సమయంలో చిన్నపిల్లాడిలా ఏడ్చేస్తాడు. చదువు కోసమో, ఉద్యోగం కోసమో ఇంటి నుంచి వెళ్లిపోతున్న కూతురు, తండ్రి కళ్లలో తనపై అత్యంత నమ్మకం, ఆశను చూస్తుంది. అయితే ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శివపురిలో టీ స్టాల్ పెట్టుకున్న మురారి ఆ చుట్టుపక్కల చాయ్‌కు ఫేమస్. తన చాయ్ టేస్ట్‌కు చాలా మందే అభిమానులు ఉన్నారు.
అయితే తనకు 5 సంవత్సరాల కూతురు ఉంది. కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులకు హజరయ్యేందుకు వీలుగా ఉంటుందని మురారి కూతురు తనను ఓ మొబైల్ కొనమని చెప్పింది. అయితే మురారి దగ్గర మొబైల్ కొనడానికి సరిపోయేంత డబ్బులు లేకపోవడంతో తన మిత్రులు సహాయం చేయడంతో రూ.12500 మొబైల్ కొన్నాడు. అయితే మురారి ఆ మొబైల్‌ను ఏకంగా గుర్రపు బండిపై, డప్పుల వాయిద్యాల నడుమ బాణసంచాలు కాలుస్తూ ఇంటికి తీసుకెళ్లాడు. దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతూ.. మురారి స్టైలే వేరు.. అంటూ చర్చించుకుంటున్నారు.