తమ ప్రణాళికలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయని, పాజిటివ్ క్రికెట్ ఆడతాం అని సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) సహాయక కోచ్ సైమన్ హెల్మోట్ తెలిపారు. తమ దూకుడైన ఆటతీరును కొనసాగిస్తామని చెప్పారు. గతంలో విజయం సాధించినా, ఓడినా సరే దానిని పక్కన పెట్టేయాలన్నారు. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని సైమన్ చెప్పుకొచ్చారు. సొంతగడ్డపై ఎస్‌ఆర్‌హెచ్ మరో సవాల్‌కు సిద్ధమైంది. ఆదివారం రాత్రి 7.30కు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో గుజరాత్…
ఐపీఎల్ 2025లో భాగంగా.. ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో.. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి విజయం నమోదు చేసుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ 44 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ టీం అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు కూడా…
ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. తొలి మ్యాచ్ ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఆరు వికెట్లకు 286 పరుగులు చేసింది. 287 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ 242 పరుగులకే పరిమితమైంది. 5 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసి ఓటమి పాలైంది. ధ్రువ్…
టీమిండియా బ్యాటింగ్ డైనమైట్ ఇషాన్ కిషన్ మాంచి ఫైర్ మీద ఉన్నాడు. బౌండరీలతో బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024 తర్వాత పూర్తిగా విఫలమైన ఇషాన్ కిషాన్ తనేంటో నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఇషాన్ కిషన్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్ ప్రాక్టీస్ మ్యాచ్‌లలో ఇషాన్ సుడిగాలి ఇన్నింగ్స్‌లతో ఇతర జట్లకి హెచ్చరికలు పంపాడు. అదే తరహాలో మొదటి మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఇషాన్ కిషన్ అద్భుతమైన…
ఈరోజు ఐపీఎల్ 2025 రెండవ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతోంది. రెండు జట్లు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో తలపడుతున్నాయి. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ రియాన్ పరాగ్ చేతిలో ఉంది. హైదరాబాద్ పగ్గాలు పాట్ కమ్మిన్స్ చేతిలో ఉన్నాయి. రెచ్చిపోయిన ఆరెంజ్ ఆర్మీ 14 ఓవర్లలోనే 200 స్కోర్ పూర్తి చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది.
ఐపీఎల్ 2025 లో భాగంగా 18వ సీజన్ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అలాగే రెండో మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు ఉప్పల్ స్టేడియంలో తలపడనున్నాయి.
Nitish Kumar Reddy: ఐపీఎల్ 2025 కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఈసారి మరింత బలమైన స్క్వాడ్‌ను సిద్ధం చేసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి హిట్టర్లకు తోడుగా, ముంబై ఇండియన్స్ తరఫున అదరగొట్టిన ఇషాన్ కిషన్ కూడా SRH లో చేరాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్లో ఇప్పటికే హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరిద్దరు గత సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వీరికి తోడుగా శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్…
Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కీలక ప్రకటన చేశారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ మెన్స్ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆస్ట్రేలియా వన్డే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. చిలిమండ గాయం కారణంగా కమిన్స్ పాల్గొనడం కష్టమని పేర్కొన్నారు. కమిన్స్ గైర్హాజరీ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని మెక్‌డొనాల్డ్ తెలిపారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో 25 వికెట్లు తీసిన…